Health Tips: చలికాలంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ జ్యూసులు తాగాల్సిందే?

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. షుగర్ రావడానికి అనేక కారణాలు ఉండగా

  • Written By:
  • Publish Date - December 17, 2023 / 06:00 PM IST

ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. షుగర్ రావడానికి అనేక కారణాలు ఉండగా అందులో ప్రధాన కారణం ఆహారపు అలవాట్లు అని చెప్పవచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు దానిని అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల మెడిసిన్స్ ని ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు వంటింటి చిట్కాలను ఉపయోగించి కూడా షుగర్ ని కంట్రోల్ లో ఉంచుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో చాలామంది సరైన ఆహారం తీసుకోక షుగర్ లెవెల్స్ పెరగడం తగ్గడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మరి చలికాలంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే కొన్ని రకాల జ్యూసులు తాగాలి అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ జ్యూస్ లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. క్యాబేజీ ఆపిల్ జ్యూస్.. క్యాబేజీలో యాంటీ ఐ సిమిక్ అండ్ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్ సి ఇలాంటి విటమిన్లు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. దానివల్ల క్యాబేజీ ఆపిల్ జ్యూస్ తీసుకోవడం వలన మంచి ఉపయోగాలు ఉంటాయి. క్యారెట్ జ్యూస్.. సహజంగా ప్రతి ఒక్కరూ శీతాకాలంలో క్యారెట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. క్యారెట్ ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మంచి చేస్తూ ఉంటుంది. క్యారెట్ జ్యూస్ లో షుగర్ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ షుగర్ వ్యాదిగ్రస్తులు దీన్ని తీసుకోవచ్చు.

క్యారెట్ జ్యూస్ తీసుకోలేని వారు క్యారెట్ తిన్నా కూడా సరిపోతుంది. దోసకాయ జ్యూస్.. చాలామంది చలికాలంలో దోసకాయ తింటే జలుబు చేస్తుంది అని అనుకుంటూ ఉంటారు. ఫ్రిజ్లో పెట్టిన వాటికంటే బయట నిల్వ చేసిన వాటిని తినడం వల్ల దగ్గు గెలుపు లాంటివి చేయవు అంటున్నారు వైద్యులు. దోసకాయ జ్యూస్ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ తీసుకోవడం వలన బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. షుగర్ పేషెంట్లు దోసకాయ జ్యూస్ తాగితే దాని వలన ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. దీనికోసం మధుమేహం వ్యాదిగ్రస్తులు దోసకాయ తప్పనిసరిగా తీసుకోవాలి. దోసకాయ చర్మాన్ని కూడా ఎన్నో విధాలుగా మెరుగుపరుస్తుంది. దానికి ప్రతి ఒక్కరు వారానికి ఒకటి లేదా రెండుసార్లు దోసకాయ తీసుకోవాలి.

టమోటా జ్యూస్.. టమోటాలు తక్కువ గ్లైసేమిక్ సూచనలకి కలిగి ఉంటాయి. అలాగే క్యాలరీలు కూడా తక్కువ మోతలో ఉంటాయి. అందుకే డయాబెటిక్ పేషెంట్లు టమోటో జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. దీని వలన శరీరానికి విటమిన్లు పొటాషియం లాంటి పోషకాలు పొందవచ్చు. టమోటా జ్యూస్ తాగడానికి ఇష్టపడని వారు టమోటాలు నేరుగా తినవచ్చు. బ్రోకలీ జ్యూస్.. బ్రోకలీలో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. బ్రోకలీలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ ని తీసుకోవడం వలన షుగర్ని కంట్రోల్ లో ఉంచడానికి ఉపయోగపడే ఫైబరు తగిన మోతాదులో ఉంటుంది. దీంతో పాటు బ్రోకలీ జ్యూస్ తీసుకోవడం వలన డయాబెటిస్ ని కంట్రోల్ లో ఉంటుంది. ఈ జ్యూస్ షుగర్ వ్యాధిగ్రస్తులకు గొప్ప ఔషధంలా పనిచేస్తుంది.