Site icon HashtagU Telugu

Diabetes: షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే.. అన్నం తినే ముందు ఇవి తినాల్సిందే?

Diabetes

Diabetes

ప్రస్తుత సమాజంలో చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలామందిని పట్టిపీడిస్తున్న అతి పెద్ద సమస్య డయాబెటీస్. శరీరంలో ఇన్సులిన్ స్థాయిలో పెరిగితే షుగర్ వస్తుందన్న ఒక విషయం మనందరికీ తెలిసిందే. ఈ డయాబెటిస్ ఇదివరకు రోజుల్లో కేవలం ముసలివారికి లేదంటే వయసు మీద పడిన వారికి మాత్రమే వచ్చేది. కానీ రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో పూర్తిగా మార్పులు రావడంతో ఈ షుగర్ వ్యాధి చిన్న వయసు వారికి వస్తోంది.

దీంతో రక్తంలోని షుగర్ స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవడం కోసం ఎంతో ఇష్టమైన తిండిని కూడా తినలేక చాలామంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్నా కూడా వెనుకడుగు వేస్తూ ఉంటారు. కాగా మన శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు మనం తినే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఆహారాన్ని తీసుకున్న తర్వాత గ్లూకోజ్ స్థాయిలు మారుతుంటాయి. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో చాలా మార్పులు కనిపిస్తాయి. అయితే డయాబెటిస్ కంట్రోల్ లో ఉండాలి అంటే అన్నం తినక ముందు కొన్ని పదార్థాలను తినాల్సిందే.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎప్పుడైనా కూరగాయలు, ప్రోటీన్స్ ముందు తీసుకుని ఆ తర్వాత అన్నం తీసుకుంటే గ్లూకోజ్ లెవల్స్ చాలా తక్కువుగా ఉంటాయి. కాబట్టి ప్రోటీన్, కూరగాయలు ఎక్కువుగా తీసుకుంటే ఇన్సులిన్ శాతం తక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కార్బోహైడ్రేట్స్ తినకూడదని చెప్పడం డాక్టర్ లకు కష్టమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రోటీన్స్ తో పాటు కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇవి శరీర ఆరోగ్యానికి చాలా అవసరం కానీ కార్బోహైడ్రేట్స్ వల్ల ఇన్సులిన్ పెరిగి పోతుందని ముందు కూరగాయలు, ప్రోటీన్ ను తీసుకుని ఆ తర్వాత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. ఇలా చేస్తే బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంచుకుని డయాబెటిస్ నియంత్రించుకోవడం సులువు అవుతుంది.