Health Tips: శీతాకాలంలో అలాంటి సమస్యలు రాకూడదంటే.. ఈ డ్రింక్ తాగాల్సిందే?

శీతాకాలం మొదలయ్యింది. చలి వణికిస్తోంది. దాంతో ప్రజలు ఇండ్లలో నుంచి రావాలి అని భయపడుతున్నారు. సూర్యోదయం అయిన తర్వాత బయటికి వస్తున్నారు. అ

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 05:30 PM IST

శీతాకాలం మొదలయ్యింది. చలి వణికిస్తోంది. దాంతో ప్రజలు ఇండ్లలో నుంచి రావాలి అని భయపడుతున్నారు. సూర్యోదయం అయిన తర్వాత బయటికి వస్తున్నారు. అయితే రోజు రోజుకి చలి తీవ్రత ఇంకా పెరుగుతూనే ఉంది. అయితే ఈ కాలంలో చలి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. చలికాలంలో జలుబు, దగ్గుల, ఆస్తమా ఇలా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. దీంతో ఏ పనైనా చేయాలంటే అలసట, నీరసం వస్తాయి. జలుబు వచ్చిందంటే బాడీ అంత వీక్ అయిపోయి జ్వరం తగిలినట్టుగా ఉంటుంది.

దగ్గు జలుబు కారణంగా కొంతమందికి తల భారంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అయితే శీతాకాలంలో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇంతకీ ఆ డ్రింక్ ఏది? దానిని తాగడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. స్పైసీ మిల్క్ తయారు చేసుకోవడానికి ముందుగా మసాలాను రెడీ చేసుకోవాలి. దీని తయారు చేసుకోవడానికి మనకు ఐదు పదార్థాలు కావాలి. దీనికి 200మి.లీ నెయ్యి, 300 గ్రాముల పసుపు, 50 గ్రాముల సొంటి పొడి, 25 గ్రాములు నల్ల మిరియాల పొడి 15 గ్రాముల దాల్చిన చెక్క పొడిని తీసుకోవాలి.

ఈ డ్రింకును తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి వేసి లో ఫ్లేమ్ లో వేడి చేయాలి. తర్వాత ఇందులో పసుపు వేసి మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత మిగిలిన మసాలా పొడులు వేసుకోవాలి. తర్వాత పసుపు వాసన పోయేంతవరకు దాని రంగు మారేవరకు ఈ మిశ్రమాన్ని వేయించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి. గాలి చొరబడని గాజు సీసాలో ఈ మిశ్రమాన్ని స్టోర్ చేసుకోవాలి. అయితే రాత్రి నిద్రపోయే ముందు ఒకటి స్పూన్ మిశ్రమాన్ని గోరువెచ్చని పాలలో వేసుకొని త్రాగాలి. ప్రతిరోజు ఈ పాలను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ ఇమ్యూనిటీ బూస్టింగ్ డ్రింక్ ఒక నెల రోజుల పాటు తాగితే చలికాలంలో వచ్చే వ్యాధులను చెక్ పెట్టవచ్చు. ప్రతిరోజు ఈ స్పైసీ మిల్క్ తాగితే జలుబు, ఎలర్జీలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్ నుంచి బయటపడవచ్చు. కాబట్టి చలికాలంలో వచ్చే సమస్యల నుంచి బయట పడాలంటే ఈ డ్రింక్ తాగాల్సిందే అంటున్నారు నిపుణులు.