Glow Skin: అందమైన మెరిసే చర్మం కావాలంటే మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోవాల్సిందే?

మామూలుగా అమ్మాయిలు అందమైన మెరిసే చర్మం కావాలని కోరుకోవడంతో పాటు అందుకోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మెరిసే చర్మం కో

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 10:00 AM IST

మామూలుగా అమ్మాయిలు అందమైన మెరిసే చర్మం కావాలని కోరుకోవడంతో పాటు అందుకోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. మెరిసే చర్మం కోసం రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ లను కూడా ఉపయోగిస్తూ ఉంటారు. చర్మం అందంగా ఉండడం కోసం, చర్మ సౌందర్యం ప్రకాశించడం కోసం బ్యూటీ పార్లర్ లకు వెళ్లి వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తుంటారు. కేవలం బ్యూటీ పార్లర్లకు వెళ్లడం రకరకాల బ్యూటీ ప్రోడక్ట్ లను ఉపయోగించడం మాత్రమే కాకుండా అందమైన మెరిసే చర్మం కావాలి అంటే మీరు తినే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అంటున్నారు వైద్యులు. ప్రోటీన్ ఉన్నమంచి ఆహారం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యంగా ఉండటమే కాకుండా నిగారింపును సొంతం చేసుకుంటుంది.

చర్మం అందంగా, నిగారింపును పొందాలంటే, ముడతలు పడకుండా ఉండాలంటే, చర్మం హైడ్రేటెడ్ గా ఉండాలంటే విటమిన్ ఏ అవసరం ఎంతైనా ఉంటుంది. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఆ ఎండ ప్రభావం మన చర్మం పైన పడకుండా విటమిన్ ఏ కాపాడుతుంది. అలాగే చర్మం హైడ్రేటెడ్ గా ఉంచడంలో విటమిన్ ఏ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆకుకూరల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. క్యారెట్, చిలకడదుంప, ఆకుకూరలు, పాలు, గుమ్మడికాయ, టమాటో, బఠానీలు, అవకాడో, బీన్స్, చేపలు మొదలైన వాటిలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వీటిని మీరు ఆహారంలో భాగంగా చేసుకుంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా మారుతుంది. చర్మం అందంగా ఉండాలంటే విటమిన్ సి అవసరం కూడా ఎంతైనా ఉంది. విటమిన్ సి చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది.

విటమిన్ సి ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి, జామ, బొప్పాయి, ఉసిరికాయ, నిమ్మకాయ, బ్రోకలీ, టమోటా, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, కివి పండు మొదలైన వాటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. అలాగే చర్మం పొడిబారినట్టు ముడతలు పడినట్లు కనిపించకుండా ఉండాలని అంటే మీ ఆహారంలో విటమిన్ ఈ చేర్చుకోవాలి. పిస్తా, బాదం ,అక్రోట్, పల్లీలు వంటి నట్స్ లో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజు మనం మొలకలను ఆహారంగా తీసుకుంటే కూడా విటమిన్ ఈ పుష్కలంగా లభిస్తుంది.చర్మంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తగ్గితే చర్మం వయసు పెద్దగా కనిపిస్తుంది. అందుకే ఎప్పుడూ ఎప్పటికప్పుడు మన ఆహారంలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ లతోపాటు ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ ను ఇచ్చే ఆహారాన్ని కూడా తీసుకోవాలి. చర్మం మృదువుగా అవుతుంది. తీసుకోవలసిన ఆహారాన్ని సరిగ్గా తీసుకోకుండా, బయట ఎన్ని పూతలు పూసినప్పటికీ చర్మ ఆరోగ్యం మెరుగు పడదు.