Heart Burn: తిన్న తర్వాత గుండెల్లో మంటగా ఉంటుందా.. అయితే ఇలా చేయండి?

ప్రస్తుత రోజుల్లో చాలావరకు ఎక్కువమంది బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉన్నారు. దీనివల్ల

  • Written By:
  • Publish Date - January 4, 2023 / 06:30 AM IST

ప్రస్తుత రోజుల్లో చాలావరకు ఎక్కువమంది బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ ని ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉన్నారు. దీనివల్ల ఎక్కువ శాతం మంది గ్యాస్ ట్రబుల్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ గ్యాస్ ట్రబుల్ సమస్య వల్ల ఏది తిన్నా కూడా గుండెల్లో మంటగా అనిపించడం సరిగా డైజెస్ట్ కాకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా ఎటువంటి పదార్థాలు తిన్న కూడా గుండెల్లో మంటగా అనిపించడం అన్నది ప్రధాన సమస్యగా మారిపోయింది. పెద్దవారికే కాకుండా చిన్నవారికి యూత్ కూడా ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ప్రస్తుతం కాలంలో మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తినేవారిలో జీర్ణ సంబంధ సమస్యలు వస్తున్నాయి. ఎసిడిటీ, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు.

అయితే గుండెల్లో మంటగా అనిపించినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్యాకేజ్డ్ ఫుడ్ అనగా చిప్స్, చాక్లెట్ వంటిటి ఆరోగ్యానికి అసలు మంచిది కాదు. అటువంటి వాటికి వీలైనంత దూరంగా ఉండాలి. ప్రాసెస్డ్ ఫుడ్స్‌లో ఉండే సంతృప్త కొవ్వు, సోడియం, ఉప్పు,బాడీలో యాసిడ్ రిఫ్లక్స్‌ను పెంచుతుది. వాటిని ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీ సమస్య పెరుగుతుంది. అలాగే గుండెల్లో మంటగా అనిపించినప్పుడు టిఫిన్ కలిగిన పదార్థాలు టీ కాఫీలాంటి వాటికి దూరంగా ఉండాలి. అదేవిధంగా మీరు తీసుకునే ఆహారంలో మసాలా దినుసులు మసాలా తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అయితే సమస్య గుండెల్లో మంటగా ఉండటం అన్నది ఊబ కాయంతో బాధపడుతున్న వారికి ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. అటువంటివారు బరువు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి.

అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేయాలి. అలాగే చాలామంది చేసే పెద్ద తప్పు ఏమిటంటే ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఒకసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల అది సరిగా జీర్ణం కాక ఈ ఆసిడ్ రిఫ్లక్స్ అవుతుంది. కాబట్టి ఒకేసారి కాకుండా రెండు మూడు సార్లు తక్కువ మొత్తంలో తీసుకోవడం మంచిది. అయితే యాసిడ్ రిఫ్లక్స్ సమస్యతో బాధపడుతున్న వారు భోజనంలో 1 టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ వేసుకోవాలి. ఇది ఛాతీలో మంటను తగ్గించడంలో బాగా సహాయ పడుతుంది. అలాగే తిన్నా వెంటనే పడుకోవడం మంచిది కాదు. తినడానికి నిద్రకు మధ్య మూడు గంటల గ్యాప్ ఉండే విధంగా చూసుకోవాలి. భోజనం చేసిన తర్వాత 15 నిమిషాల పాటు నడవాలి.