Site icon HashtagU Telugu

Health Tips: ఎక్కువసేపు సిస్టమ్ దగ్గర పని చేస్తున్నారా.. అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే?

Mixcollage 04 Jan 2024 07 18 Pm 322

Mixcollage 04 Jan 2024 07 18 Pm 322

ప్రస్తుత రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెల్ ఫోన్లు లాప్టాప్ లు సిస్టమ్ లు ట్యాబ్ లు వంటివి ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిని ఎక్కువగా వినియోగించడం వల్ల ఆ చిన్న వయసులోనే కంటి చూపును కోల్పోవడంతో పాటు కళ్ళజోడును పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం సాఫ్ట్వేర్ జాబులు అన్నీ కూడా ఎక్కువసేపు సిస్టం ముందు కూర్చొని చేసేవి వస్తున్నాయి. ఇలా గంటల తరబడి సిస్టం ముందు కూర్చోవడం వల్ల కళ్లనొప్పి నిద్రలేమి వంటి సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ ను చూడడం వల్ల మన కళ్ల మీద స్ట్రెస్ పడే అవకాశం ఉంటుంది.

కావున మన కళ్ల మీద పడ్డ స్ట్రెస్ ను తగ్గించుకోవడం కోసం కింది సింపుల్ చిట్కాలను పాటించడం చాలా మంచిది. నేటి రోజుల్లో ఎక్కువ మందికి వర్క్ ఫ్రం హోం అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిట్కాలను పాటిస్తే కళ్లను సైడ్ ఎఫెక్స్ట్ రాకుండా కాపాడుకోవచ్చు. అదే పనిగా కంప్యూటర్ స్ర్కీన్ ను చూడడం వలన మన కళ్లు అలసిపోతాయి. కావున కొద్ది సేపు బ్రేక్ ఇవ్వడం మంచిది. వర్క్ ఫ్రం హోం ఆప్షన్ ఉన్నవాళ్లు వర్క్ లో ఉంటూనే మధ్యాహ్న భోజనం పూర్తి చేసుకోవాలి. తర్వాత లంచ్ టైం గంట సేపు కాస్త రిలాక్స్ గా పడుకోవాలి. ఇలా చేయడం వలన మన కళ్లు రిఫ్రెష్ అవుతాయి.

కాబట్టి మన కళ్లకు తిరిగి ఎనర్జీ గేన్ అవుతుంది. ఆఫీస్ లో వర్క్ చేసే వాళ్లు కూడా కళ్లకు తగినంత సేపు విశ్రాంతినివ్వాలి. తిన్న తర్వాత ఒక అరగంట సేపు కళ్లు మూసుకుని రిలాక్స్ గా ఉండాలి. ఇలా చేయడం వలన మన కళ్ల మీద పడ్డ స్ట్రెస్ తగ్గిపోతుంది. మళ్లీ మన కళ్లు ఎనర్జీని అందుకుని చాలా ఉత్సాహంగా అవుతాయి. రోజుకు ప్రతి ఒక్కరూ ఎనిమిది గంటల సేపు రిలాక్స్ గా పడుకోవాలి. అలాంటపుడే కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

Exit mobile version