Site icon HashtagU Telugu

Health Tips: రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవ్వాలంటే వేపాకుతో ఇలా చేయాల్సిందే?

Diabetes

Diabetes

ప్రస్తుత రోజుల్లో ఎక్కువ శాతం మందిని వేధిస్తున్న సమస్య మధుమేహం. చిన్న పెద్ద అనే వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు ఇదిలా ఉంటే చాలామంది డయాబెటిస్ బారిన పడిన తర్వాత షుగర్ కంట్రోల్ కావడం లేదని తెగ బాధ పడుతూ ఉంటారు. ఇక అలాంటి వారు షుగర్ కంట్రోల్ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడంతో పాటు, ఆహారపు అలవాట్లను, నిద్ర అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఆయుర్వేదంలో షుగర్ ను కంట్రోల్ చేయడానికి వేప ఎంతో బాగా ఉపయోగపడుతుందట.

ప్రతిరోజు వేపాకులను నమిలి తిన్నా, వేప కషాయం చేసుకుని తాగినా మంచి ఫలితాలు ఉంటాయట. వేప యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది. దానిలో అనేక వ్యాధులను తరిమికొట్టే గొప్ప లక్షణం ఉంటుంది. వేప చెట్టులోని ప్రతి భాగం ఔషధ యుక్తమే. వేప డయాబెటిస్ ను పూర్తిగా నయం చేయలేక పోవచ్చు కానీ వ్యాధి తీవ్రత ను మాత్రం తగ్గించగలదు. డయాబెటిస్ ఎక్కువగా పెరగకుండా చేయగలదు. ప్రతిరోజు ఒక క్రమ పద్ధతిలో ఉదయం లేవగానే వేపాకులను తిన్నా, వేప ఆకులతో కషాయం తయారుచేసుకొని తాగినా రక్తంలో షుగర్ స్థాయిలు తగ్గుతాయి.

వేపాకుల కషాయం తయారు చేసుకోవడానికి 20 వేపాకులను నీళ్ళలో వేసి నీరంతా వేపాకుల రసం దిగి పచ్చగా మారేదాకా మరిగించుకోవాలి. ఆపై దానిని వడకట్టి వేడిగా కానీ చల్లార్చిన తర్వాత గాని రోజుకు రెండు సార్లు తాగితే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు. ఇక డయాబెటిస్ ను కంట్రోల్ చేయడమే కాకుండా వేపాకు చర్మ వ్యాధులకు, నోటి సమస్యలకు, ఇన్ఫెక్షన్లు, శరీరం మంట తదితర ఆరోగ్య సమస్యలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.