Site icon HashtagU Telugu

Ghee: నెయ్యి ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త!

Ghee

Ghee

చాలామంది నెయ్యిని తెగ ఇష్టంగా తింటూ ఉంటారు. ఆహారంలో భాగం చేసుకోవడంతో పాటు స్వీట్ల రూపంలో అలాగే ఇతర పదార్థాల రూపంలో కూడా నెయ్యిని ఎక్కువగా తింటూ ఉంటారు. అయితే నెయ్యి ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు. నెయ్యి ఆరోగ్యానికి మంచిదే కానీ అలా అని ఎక్కువగా తీసుకోవడం అసలు మంచిది కాదట. మరి నెయ్యిని ఎక్కువగా తింటే ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నెయ్యిలో కరిగే కొవ్వు విటమిన్లు, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

ప్రతిరోజూ ఒక చెంచా నెయ్యిని తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలు కూడా బలంగా మారుతాయి. గట్ ఆరోగ్యం కూడా బాగుండటంతో పాటుగా ఇది మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. నెయ్యి మన ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా దీన్ని ఎక్కువ మొత్తంలో తీసుకోవడం మాత్రం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మనల్ని ఎన్నో సమస్యల బారిన పడేస్తుంది. ఆరోగ్యకరమైన నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సంతృప్త కొవ్వులు, ముఖ్యమైన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే మన మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర వహించే విటమిన్ ఎ, విటమిన్ ఇ, విటమిన్ డి వంటి కొవ్వులలో కరిగే విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఏదేమైనా నెయ్యిని మోతాదులోనే తీసుకోవాలి.

ముఖ్యంగా 40 ఏండ్లు పైబడిన వారు నెయ్యిని ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదని చెబుతున్నారు. ఎందుకంటే నెయ్యిలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఈ కొవ్వులు మీ ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది. కొవ్వు కాలేయ వ్యాధి ఉన్నవారు కూడా నెయ్యి పూర్తిగా మానేయాలని చెబుతున్నారు. ఒకవేళ తినాలి అనుకుంటే తక్కువ మోతాదులో తీసుకోవాలని చెబుతున్నారు. నెయ్యిలో కొవ్వు, కొలెస్ట్రాల్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అందుకే దీన్ని పెద్ద వయసు వారు ఎక్కువగా తీసుకోకూడదు. ఒకవేళ ఎక్కువగా తీసుకుంటే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందట. కాబట్టి వృద్ధులు నెయ్యికి దూరంగా ఉండటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.