Raw Papaya: పచ్చి బొప్పాయి వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ మధ్య

  • Written By:
  • Updated On - March 5, 2024 / 07:28 PM IST

బొప్పాయి పండు వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో ఈ బొప్పాయి పండ్లు మనకు మార్కెట్లో ఏడాది పొడవునా లభిస్తున్నాయి. బొప్పాయిని పోషకాల నిధి అని చెప్పవచ్చు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ బి, ఎటమిన్ సి ఇలా ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. బొప్పాయిలో తక్కువ కేలరీలు ఎక్కువ పోషకాలు ఉండడం ఒక విశేషం. కాగా ఇందులో విటమిన్లతో పాటు ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, కాలుష్యం, మెగ్నీషియం లాంటి మినరల్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. సహజంగా పండిన బొప్పాయిని అధికంగా తీసుకుంటూ ఉంటారు.

కేవలం బొప్పాయి పండు వల్ల మాత్రమే కాకుండా పచ్చి బొప్పాయి వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. మరి పచ్చి బొప్పాయి వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అన్న విషయానికి వస్తే..ఫైబర్ , డైజెస్టివ్ ఎంజైమ్ లకు మంచి మూలకమైన బొప్పాయిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు బాగా తగ్గుతారు. బొప్పాయిని తినడం వల్ల చాలా సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని కారణంగా పదేపదే తినాలి అనే ఫీలింగ్ లేకుండా పోతుంది. బొప్పాయిని అల్పాహారంగా తీసుకుంటే బరువు బాగా తగ్గుతారు. అయితే పండిన బొప్పాయినే కాదు పచ్చి బొప్పాయి, వాటి ఆకులలో కూడా చాలా పోషకాలు ఉంటాయి.

పచ్చి బొప్పాయిలో చక్కెర స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల పచ్చి బొప్పాయి ముక్కలను తింటే మధుమేహం అదుపులో ఉంటుంది. డెంగ్యూతో బాధపడే వారికి బొప్పాయి ఆకుల రసాన్ని తాగిస్తే ప్లేట్లెట్ల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆకుల్లో ఉండే సైటో టాక్సిన్లు క్యాన్సర్ కారకాలను నిరోధిస్తుంది. పచ్చి బొప్పాయి లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బొప్పాయి ఆకులలోని పోషకాల వల్ల నెలసరి సమస్యలు ఉండవు బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. ఎలాంటి ఇన్ఫెక్షన్లను రాకుండా బొప్పాయి కాపాడుతుంది.

ఎవరికైనా గాయాలు అయితే ఆ గాయాలపై బొప్పాయి గుజ్జును రాయడం వల్ల కూడా గాయాలు త్వరగా నయం అవుతాయి.పచ్చి బొప్పాయిలో సపోనిన్, బీటా కెరోటిన్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, లైకోపీన్ ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పచ్చి బొప్పాయి శరీరం నుంచి వ్యర్ధాలను దూరం చేస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచుతుంది. కామెర్ల వ్యాధిని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పచ్చి బొప్పాయితో కూర వండితే ఆ కూర కూడా రుచిగా ఉంటుంది. పచ్చి బొప్పాయి కంటి చూపును మెరుగుపరుస్తుంది. పండిన బొప్పాయి కంటే పచ్చి బొప్పాయిలో ఎక్కువ యాక్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. పొఫైన్ , చైమో పోపైన్ లు శరీరంలోని అధిక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి.