Health Tips: కొబ్బరి,బెల్లం కలిపి తినడం వల్ల ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అలాగే కొన్ని రకాల సమస్యలు తగ్గుతాయట. ఇది బరువును తగ్గించడంతో పాటుగా కీళ్ల నొప్పలను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు. మరి ఇవి రెండు కలిపి తింటే ఏమి జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొబ్బరి, బెల్లంలో మెగ్నీషియం, ఇనుము పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. కొబ్బరిలో చక్కెరలో కంటే పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
దీనిలో కాల్షియం కూడా ఎక్కువ మొత్తంలో ఉంటుందట ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయిట. బెల్లం, కొబ్బరను కలిపి తినడం వల్ల దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందిట. గోరు వెచ్చని నీటిలో కొంచెం బెల్లం వేసుకుని లేదా టీ లో చక్కెరకు బదులుగా బెల్లాన్ని వేసి తాగినా శ్వాస సంబంధిత సమస్యలు తొలగిపోతాయట. కొబ్బరి, బెల్లంను కలిపి క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుందట. అంతేకాదు జీర్ణ ఎంజైమ్ లి సక్రమంగా ఉంచుతుందట. అలాగే ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుందని చెబుతున్నారు.
కొబ్బరి, బెల్లంలో ఉండే పొటాషియ బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుందట. అంతేకాకుండా శరీరంలో నీరు అవసరమైన దానికంటే నిల్వ లేకుండా కాపాడుతుందని, తద్వారా మీ బరువు నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. గర్భంతో ఉన్న ఆడవారు కొబ్బరి, బెల్లాన్ని తినడం వల్ల పిండంపై చెడు ప్రభావం చాలా వరకు తగ్గుతుందట. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయని, గర్భిణులు కొబ్బరి, బెల్లాన్ని ఏడో నెల నుంచి తీసుకుంటే ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. మైగ్రేన్ నొప్పితో బాధపడేవారు దాని నుంచి ఉపశమనం పొందడం అంత తేలిక కాదు. అయితే ఈ సమస్య ఉన్న వారు కొబ్బరి, బెల్లాన్ని కలిపి తింటే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుందట. కొబ్బరి, బెల్లంలో కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయట. ఇవి చాలా త్వరగా జీర్ణమవుతాయని, కాబట్టి అలసటగా ఫీలైనప్పుడు వీటిని తింటే వెంటనే మీ శరీరానికి శక్తి లభిస్తుందని చెబుతున్నారు.
Health Tips: వామ్మో.. కొబ్బరి, బెల్లం వల్ల ఏకంగా అన్ని రకాల ప్రయోజనాలా!

Health Tips