Site icon HashtagU Telugu

Health Tips: ఏంటి లవంగాలను తింటే అన్ని రకాల సమస్యలు నయం అవుతాయా?

Mixcollage 06 Feb 2024 02 14 Pm 3550

Mixcollage 06 Feb 2024 02 14 Pm 3550

మాములుగా ప్రతి ఒక్కరి వంట గదిలో లవంగాలు తప్పనిసరిగా ఉంటాయి. తరచుగా కూరల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో లవంగం కూడా ఒకటి. లవంగం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా చలికాలంలో వచ్చే అనేక రోగాల బారి నుండి లవంగాలు కాపాడతాయి. శీతాకాలంలో చాలామంది జలుబుతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగాల టీ తాగితే ఉపశమనం లభిస్తుంది. లవంగాలలో ఉండే యాంటీ మైక్రోబియల్, యాంటీసెప్టిక్ లక్షణాలు ఇన్ఫెక్షన్లు మన దగ్గరకు రాకుండా పోరాటం చేస్తాయి. ఇక శీతాకాలంలో చాలా మంది విపరీతమైన దగ్గుతో బాధపడుతూ ఉంటారు.

పొడిదగ్గు, కఫంతో బాధపడే వారికి లవంగం చాలా బాగా పనిచేస్తుంది. ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల పొడిదగ్గు నయమవుతుంది. కఫం సమస్య బాగా తగ్గుతుంది.చాలామంది పంటినొప్పితో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు లవంగం టీ తాగడం వల్ల లేదా లవంగాలను నమలడం వల్ల పంటినొప్పి తగ్గడంతో పాటు నోటి దుర్వాసన కూడా దూరం అవుతుంది. రోజు లవంగం టీ తాగితే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. భోజనం చేసిన గంట తర్వాత లవంగం టి తీసుకోవడం వల్ల ఎసిడిటీ, మలబద్ధకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

లవంగాలు శరీరంలోని టాక్సిన్లను తొలగించి చర్మం మృదువుగా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. లవంగాలలో యుజైనాల్ అనే తైలం ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులతో బాధపడేవారు రెగ్యులర్ గా లవంగాలను వాడడం వల్ల వారికి ఉపశమనం కలుగుతుంది. లవంగాలలో ఉండే యుజైనాల్ తైలం యాంటీసెప్టిక్ లా పనిచేసి పళ్ళ చిగుళ్ళను కాపాడుతుంది. పంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. లవంగాలలో ఉండే విటమిన్ సి మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రెగ్యులర్ గా లవంగాలను వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. లవంగాలు బ్లడ్ షుగర్ లెవెల్స్ ని బాగా కంట్రోల్ చేస్తాయి.