Site icon HashtagU Telugu

Health Tips: అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నారా.. ఖాళీ కడుపుతో తింటే చాలు?

Mixcollage 24 Dec 2023 05 24 Pm 3123

Mixcollage 24 Dec 2023 05 24 Pm 3123

ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ అధిక బరువు సమస్య కారణంగా ఎటువంటి పని చేయాలి అన్నా కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే కొందరు బక్క పల్చగా ఉన్నాను అని బాధపడుతుంటే ఇంకొందరు మాత్రం ఎక్కువగా లావు అవుతున్నాము బరువు తగ్గాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక వెయిట్ లాస్ అవ్వడం కోసం ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగించడంతో పాటు వర్కౌట్స్ చేయడం జిమ్ కి వెళ్లడం వ్యాయామలు చేయడం డైట్లు ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు.

అయినప్పటికి ఫలితాలు లభించక దిగులు చెందుతూ ఉంటారు. మీరు కూడా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా. అయితే ఇప్పుడు మేము చెప్పబోయే ఈ చిట్కాను పాటిస్తే చాలు ఎంత బరువు ఉన్నా కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వాల్సిందే. బరువును నియంత్రణలో ఉంచుకోవడానికి వెల్లుల్లి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఖాళీ కడుపుతో వెల్లుల్లి తింటే ఈజీగా బరువు తగ్గుతారు. వెల్లుల్లి కాళీ కడుపుతో తీసుకోవడం వలన బరువు తగ్గుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పచ్చి వెల్లుల్లి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇది నరాలను రిలాక్స్ చేస్తుంది. బరువు తగ్గటంలో కూడా సహాయపడుతుంది. వెల్లుల్లి బరువు తగ్గించడంలో సహాయపడే అనేక పోషకాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలో శక్తిని పెంచడానికి కూడా పనిచేస్తుంది. జీవ క్రియను పెంచి బరువను నియంత్రించే పోషకాలు ఇందులో ఉంటాయి. ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో కొన్ని వెల్లుల్లి రెబ్బలు తినడం వలన శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది. వెల్లుల్లిలో ఉండే బూస్టింగ్ లెవెల్ క్యాలరీలను వేగంగా కరిగించడంలో సహాయపడుతుంది. దీని తీసుకోవడం వలన చాలాసేపు కడుపు నిండినట్లు అనిపిస్తోంది. అలా అని అతిగా కూడా తినకూడదు.

వెల్లుల్లి డిటాక్సిఫైయింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరం నుంచి విషాన్ని బయటకు పంపించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గటానికి ప్రతిరోజు ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినాలి. మలబద్ధకం సమస్య ఉన్నవారు వెల్లుల్లిని తినకూడదు. గర్భిణీ స్త్రీలు, పిల్లలు బీపీ రక్తస్రావం, డయాబెటిస్ ఉన్నవారు ఈ వెల్లుల్లిని తినకూడదు. వెల్లుల్లిని ఎక్కువగా తింటే ఇది కడుపుని చికాకు పెడుతుంది. గ్యాస్ట్రో ఎసోఫాగియల్ రిఫ్లక్స్ సమస్య ఉన్నవారు దీనిని తినకూడదు. ఇందులో ఉండే రసాయనాలు ఛాతి, కడుపులో మంటను కలిగిస్తాయి. కాబట్టి దానిని ఎక్కువగా తినకూడదు. కొంతమందిలో అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది.