Site icon HashtagU Telugu

Tulsi Leaves for Low BP: లో బీపీ సమస్యతో బాధపడుతున్నారా.. తులసి ఆకులతో చెక్ పెట్టండిలా?

Low BP

Low BP

ప్రస్తుత రోజుల్లో చాలామంది లో బీపీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ లోబీపీ సమస్యతో బాధపడుతున్నారు. లో బీపీకి ప్రధాన కారణం మనం తినే ఆహార పదార్థాలు. కానీ లో బీపీ సమస్యను కూడా తీవ్రంగా పరిగణించకపోతే దాని ప్రభావం ఆరోగ్యంపై కచ్చితంగా చూపిస్తుంది. అయితే లో బీపీ సమస్యను చాలా మంది తొందరగా గుర్తించకపోవడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంటుంది. అయితే కొంతమంది తెలియకుండానే తమకు ఉన్న లో బీపీ సమస్యను బలహీనతగానో లేక మరొక రకమైన ఆరోగ్య సమస్యగానో భావించి కొట్టిపారేస్తుంటారు.

లోబీపీ రావడానికి గల కొన్ని కారణాలు ఏంటీ అన్న విషయానికి వస్తే.. శరీరానికి తగినంత నీరు అవసరం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు, రక్త సరఫరాలో అవాంతరాలు ఏర్పడుతాయి. రక్త నాళాల ద్వారా రక్తాన్ని పంప్ చేసేందుకు గుండె ఎప్పటికంటే ఇంకొంత ఎక్కువే శ్రమించాల్సి ఉంటుంది. దీంతో లో బీపీ సమస్య తలెత్తుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలోనూ లో బీపీ సమస్య రావడం అనేది సర్వసాధారణం. అలాగే విటమిన్ బి 12, ఐరన్ వంటి కొన్ని పోషకాహార లోపం వల్ల బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. ఇది రక్తహీనతగా మారుతుంది.

ఉప్పును అధిక మోతాదులో తీసుకోకూడదు. అలాగే తక్కువ మోతాదులోనూ తీసుకోకూడదు. ఉప్పు తగినంత మోతాదులో లేకపోతే బ్లడ్ ప్రెషర్ పడిపోతుంది. అయితే మరి లోబీపీ సమస్యకు తులసీ ఆకులు ఎలా పనిచేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. తులసి ఆకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. యుజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.