Site icon HashtagU Telugu

Diabetes : షుగర్ వ్యాధిగ్రస్తులు చేపలు, పెరుగు తినవచ్చా.. తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Mixcollage 19 Jan 2024 02 39 Pm 1844

Mixcollage 19 Jan 2024 02 39 Pm 1844

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. కాగా రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో చేపలు,పెరుగు కూడా ఒకటి.

చాలామంది షుగర్ వ్యాధి గ్రస్తులకు పెరుగు తినడం అలాగే చేపలను తినడం అంటే ఇష్టం అయినప్పటికీ షుగర్ కారణంగా వారికి కాస్త దూరంగా ఉంటారు. మరి నిజంగానే షుగర్ వ్యాధిగ్రస్తులు చేపలు పెరుగు తినకూడదా? తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగులో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, విటమిన్ డి కలగలిసి ఉన్న పెరుగు హెల్తీ ఫుడ్స్ లో ఒకటిగా పేరొందింది. కార్బోహైడ్రేట్స్ తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెరుగు మంచి ఆహారమేనట. రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గించే సామర్థ్యం పెరుగు సొంతం.

పెరుగులో కాల్షియం, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి కనుక ఎముకలు, దంతాలు ధృడంగా ఉండటానికి పెరుగు మేలు చేస్తుంది. ప్రోబయోటిక్ పెరుగు మీ శరీరంలో మంటను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఈ ప్రోబయోటిక్ కర్డ్ మరింత మంచిది. డయాబెటీస్ వల్ల కంటిచూపు కూడా మందగిస్తుంది. అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. కాబట్టి వారినికి కనీసం రెండుసార్లు చేపలు తింటే ఆయా సమస్యల నుంచి బయటపడవచ్చు.

వారానికి రెండుసార్లు చేపలు తింటే 500 మిల్లీ గ్రాముల ఒమేగా 3 శరీరానికి అందుతుందట.మధుమేహ వ్యాధిగ్రస్తులు చేపలు తింటే చాలా మంచిది. హెర్రింగ్, సార్డైన్, సాల్మన్, అల్బకోర్ ట్యూనా, మాకేరాల్ వంటి చేపల్లో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి గుండె, రక్తనాళాల ఆరోగ్యాన్ని పెంచుతాయి. అందుకే వారంలో కేవలం రెండు సార్లు అయిన చేపలను తినటానికి ప్రయత్నించాలి.