Health Tips: ఎక్కువసేపు కూర్చొని పనిచేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తూ ఉంటారు. కొంతమంది ఎనిమిది

  • Written By:
  • Publish Date - March 9, 2023 / 06:30 AM IST

సాధారణంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఎక్కువగా కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తూ ఉంటారు. కొంతమంది ఎనిమిది గంటలసేపు పని చేస్తే మరి కొంతమంది 12 గంటల సేపు కంప్యూటర్ ముందు కూర్చుని పని చేస్తూ ఉంటారు. అయితే ఇలా కంప్యూటర్ ముందు అలాగే కూర్చొని పనిచేసే వారికి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా చాలామంది అలాగే కూర్చుని పని చేయడం వల్ల వెన్ను నొప్పికి గురవుతూ ఉంటారు. అలా ఎక్కువ సేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం వల్ల వెన్ను నొప్పి కలుగుతుంది. అధికంగా మెదడుతో ఆలోచించి పనిచేసే వారికి ఒత్తిడి పెరిగి అది కాస్త శరీరంలో పలు మార్పులకు దారితీసే అవకాశం ఉంటుంది.

అయితే గంటల తరబడి కూర్చుని పని చేస్తే అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. అయితే సిస్టం ముందు కూర్చుని పని చేసేవారు అలాగే కూర్చుని ఉండకూడదు. ప్రతి అర్ధగంటకు లేచి ఒకసారి ఎలా వాకింగ్ చేస్తూ ఉండాలి. దాంతోపాటు వ్యాయామం యోగా లాంటివి కూడా చేయడం అలవాటు చేసుకోవాలి. ఎక్కువ సేపు కూర్చొని పనిచేయడం వల్ వెన్ను నొప్పి సంబంధిత సమస్యలు వేధిస్తాయి. అందుకే ఎప్పుడూ నిటారుగా కూర్చుని పనిచేయాలని చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వ్యాయామం యోగా చేయాలి. అలాగే రెండు చేతులతో కాలి వేళ్లను పట్టుకుని ఉండాలి. అప్పుడు కాళ్లను నిటారుగా ఉంచాలి.

ఇలా తరచూ చేస్తూ ఉంటే వెన్నునొప్పి సమస్యలు రావు. ఒకవేళ తీవ్రమైన వెన్నునొప్పి వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఆవాల నూనెతో చేసే మసాజ్‌ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. స్నానం చేసే టైంలో గోరువెచ్చని నీటిలో కొన్ని చుక్కల యూకలిప్టస్‌ నూనె వేసుకుంటే వెన్నునొప్పి త్వరగా తగ్గుతుంది. సాధారణంగా అధిక బరువు ఉన్నవారిలో నడుము నొప్పి సమస్య తగ్గదు. కంటినిండా నిద్ర లేకపోవడం వలన కూడా ఈ సమస్య ఎక్కువ అవుతుంది.