Site icon HashtagU Telugu

Hemoglobin Increase: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?

Hemoglobin Increase

Hemoglobin Increase

ప్రస్తుత రోజులో చాలామంది రక్త హీనత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. శరీరంలో అతి ముఖ్యమైన పదార్థం అయినా రక్తం తక్కువగా ఉండటం వల్ల రక్తహీనత సమస్య వస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు అనేక రకాల సమస్యలు ఎదురవుతాయి. అయితే రక్తహీనత సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని రకాల పదార్థాలను తినాల్సిందే. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. శరీరంలో రక్తం తక్కువ అయినప్పుడు బలహీనత ఎక్కువౌతుంది. తల తిరగడం, అలసట, బలహీనత వంటి సమస్యలు వస్తాయి.

మరి అందుకోసం తీసుకోవాల్సిన ఆహార పదార్థాల విషయానికి వస్తే.. దానిమ్మలో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దానిమ్మను మీ డైట్‌‌లో చేర్చుకోవడం వల్ల హిమోగ్లోబిన్, రక్తం కొరత దూరమౌతుంది. ఇందులో ఐరన్‌తో పాటు విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా లభిస్తాయి. అలాగే బీట్‌రూట్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. బీట్‌రూట్ తినడం వల్ల రక్తం వేగంగా పెరుగుతుంది. ఎనీమియా ఉంటే బీట్‌రూట్ జ్యూస్ చేసుకుని తాగాలి. బీట్‌రూట్ సలాడ్ రూపంలో తినడం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. బీట్‌రూట్ తినడం వల్ల శరీరంలోని రక్తం శుభ్రమౌతుంది. యాపిల్‌ లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది.

హిమోగ్లోబిన్ స్థాయి పెంచుతుంది. యాపిల్ డైట్‌లో చేర్చడం ద్వారా శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పూర్తవుతుంది. యాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఉసిరికాయలు అనేవి ఐరన్‌కు అద్భుతమైన సోర్స్. ఇందులో విటమిన్ సి, కాల్షియం కూడా పెద్దమొత్తంలో ఉంటాయి. ఎనీమియా ఉన్నప్పుడు ఉసిరి చాలా మంచిది. ఉసిరితో క్యాండీ, పౌడర్ వంటివి తింటే మంచి ఫలితాలు ఉంటాయి. నాన్‌వెజ్ తినేవారికి రెడ్‌మీట్ ద్వారా ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇందులో ఐరన్‌తో పాటు ప్రోటీన్లు, సెలేనియం, విటమిన్ బి వంటి పోషక పదార్ధాలు ఉన్నాయి.