మామూలుగా స్త్రీలకు కొన్ని కొన్ని సార్లు అనుకోని పరిస్థితులు, అనుకోని కారణాల వల్ల గర్భస్రావం అవుతూ ఉంటుంది. ఇలా గర్భస్రావం అయినప్పుడు శారీరకంగా మానసికంగా అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా గర్భస్రావం తర్వాత ఆడవారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో సుమారుగా రెండు వారాల పాటు కడుపు తిమ్మిరి, బలహీనత, నొప్పి, అధిక రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు. ఈ శారీరక సమస్యలు తగ్గడానికి కొంత సమయం పడుతుంది. మరి గర్భస్రావం తర్వాత తొందరగా కోలుకోవాలంటే ఏం చేయాలి? ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఎలాంటి జాగ్రత్తలు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గర్భస్రావం తర్వాత వచ్చే సమస్యలను తగ్గించడానికి ఆరోగ్యకరమైన ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. గర్భస్రావం తర్వాత తగినంత ప్రోటీన్ ఉన్న ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఇవి మీ కండరాలను నిర్మించడానికి సహాయపడతాయి. ఇది గర్భస్రావం తర్వాత మీ శరీరం వేగంగా కోలుకోవడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే గర్భస్రావం తర్వాత ద్రవాలను పుష్కలంగా తీసుకోవాలి. దీనివల్ల మీ శరీరంలో రక్త నష్టం జరగదు. గర్భస్రావం నుంచి త్వరగా కోలుకోవడానికి డిటాక్స్ డ్రింక్స్, కొబ్బరి నీళ్లు, దానిమ్మ జ్యూస్ ను రెగ్యలర్ గా తాగాలని చెబుతున్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీ లకు శరీరంలో కాల్షియం లోపం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే గర్భస్రావం తర్వాత మీ రోజువారీ ఆహారంలో కాల్షియం పుష్కలంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.
గర్భస్రావం తర్వాత కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్ ను అస్సలు తినకూడదట. గర్భస్రావం తర్వాత మీరు ఎక్కువగా తీపి తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే గర్భస్రావం అయిన వెంటనే ఆల్కహాల్ ను తాగకూడదు. ఎందుకంటే ఆల్కహాల్ ను తాగడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది. అదేవిధంగా జంక్ ఫుడ్ ను తినడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా గర్భస్రావం తర్వాత తినడం మంచిది కాదు. బర్గర్లు, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.