Site icon HashtagU Telugu

Mouth Ulcer: ఏంటి.. మనం తరచుగా తినే ఈ ఫుడ్స్ నోటిపూత సమస్యకు కారణమా?

Mouth Ulcer

Mouth Ulcer

మామూలుగా నోటిపూత సమస్యకు కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సీజన్ తో సంబంధం లేకుండా అన్ని సీజన్లలో కొంతమందికి ఈ నోటి పూత సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నోటిపూత సమస్య కారణంగా కొంచెం ఆహార పదార్థాలు తిన్నాలన్న నీళ్లు తాగాలి అన్న కూడా మాట్లాడాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం నువ్వు కారంగా ఉండే ఆహార పదార్థం తిన్నాము అంటే నొప్పి భరించడం చాలా కష్టం. కొన్ని కొన్ని సార్లు ఈ నోటి పూత సమస్య పెద్దదయి నోరు మొత్తం వ్యాప్తి చెందుతూ ఉంటుంది. నిజానికి ఇది ఒక చిన్న వ్యాధి అని చెప్పాలి.

ఈ సమస్యలో నోటిలో ఒక సున్నితమైన పొర కణజాలం ఇచ్చిన అవుతుంది. ఈ సమస్య ఉన్నవారు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆమ్లంగా లేదా కొద్దిగా పుల్లగా ఉండే పండ్లను తినడం వల్ల నోటి సున్నితమైన కణజాలాలపై ఒత్తిడి పెరుగుతుందట. ఇది నోటి పూతలకు కారణమవుతుందని చెబుతున్నారు. సున్నితమైన నోటి చర్మం ఉన్నవారిలో నోటి పూతలు త్వరగా అవుతాయట. ఇలాంటి వారు పైనాపిల్, నారింజ, నిమ్మకాయ వంటి పండ్లకు దూరంగా ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు. అలాగే గింజలు కూడా నోటి పూతలకు కారణమవుతాయి.

వీటిలో ఉండే అమైనో యాసిడ్ నోటి పూతలు అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. అలాగే గింజలను నానబెట్టకుండా అలాగే తినడం వల్ల కడుపులో వేడి పెరిగి అల్సర్లు వస్తాయట. అలాగే ఉప్పు వేసిన గింజలలో సోడియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అల్సర్ కు కారణమవుతుందని, అలాగే ఇది నోటి గాయాలు మంట ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు.. అదేవిధంగా చాక్లెట్స్ లో బ్రోమైడ్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది సున్నితమైన చర్మాన్ని మరింత ప్రభావితం చేస్తుందట.అయితే చాక్లెట్ ను మరీ ఎక్కువగా తింటే మౌత్ అల్సర్ సమస్య వస్తుందట.

అందుకే చాక్లెట్ ను మితంగా తినడమే మంచిదని చెబుతున్నారు. స్పైసి ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా నోటి పొరపై ప్రతికూల ప్రభావం పడుతుందట. ఈ ఆహారాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పై ప్రభావం పడటంతో పాటు నోటి పూత సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు. సాల్ట్ స్నాక్స్, బంగాళాదుంప చిప్స్ తో సహా కొన్ని రకాల ఆహారాలు నోటి పూతలకి కారణమవుతాయి. అందుకే చిప్స్ ను మరీ ఎక్కువగా తీసుకోకూడదట. ఎందుకంటే ఇవి నోటిపూత సమస్యను మరింత పెంచుతాయట.

Exit mobile version