Site icon HashtagU Telugu

Health Tips: విరేచనాలు అవుతున్నాయా.. అయితే పొరపాటున కూడా ఈ ఆహారాలు అస్సలు తినకండి?

Health Tips

Health Tips

మామూలుగా కొన్ని కొన్ని సార్లు మనం ఆహారం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక విరేచనాలు వంటివి అవుతూ ఉంటాయి. కొన్నిసార్లు వాంతులు విరేచనాలు ఎక్కువ అవ్వడం వల్ల ఒంట్లో శక్తి మొత్తం నశించి పోతూ ఉంటుంది. దాంతో చాలా టైడ్ గా కనిపిస్తూ ఉంటారు. కొన్నిసార్లు విపరీతమైన కడుపునొప్పితో విరోచనాలు అవుతూ ఉంటాయి. ఇక పదే పదే మోషన్స్ అవడం వల్ల బాత్రూంలోకి పరిగెత్తి ఓపిక లేక నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి అన్న కూడా కాస్త సంకోచిస్తూ ఉంటారు. ఇంకొందరు ఏది అయితే అది అయ్యింది అని ఏ ఆహారం పడితే ఆ ఆహారం తింటూ ఉంటారు.

అయితే వీరేచనాల వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి పొందటానికి, అలాగే విరేచనాలను కంట్రోల్ చెయ్యటానికి ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విరేచనాలు ఇబ్బంది పెడుతున్న సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఏం తినొచ్చు ఏం తాగొచ్చు అనేది తెలుసుకుని తదనుగుణంగా ఆహారాన్ని తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు అరటిపండు తినడం మంచిదని, అరటిపండు తినడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుందని, ఫలితంగా మోషన్ నార్మల్గా ఉంటుందని చెబుతున్నారు. కాగా అరటి పండులో ఉండే పొటాషియం, ఫైబర్ కడుపులో సాధారణ స్థితికి దోహదం చేస్తాయని చెబుతున్నారు.

అలాగే చెక్కు తీసిన యాపిల్స్ కూడా ఈ సమస్యకు బాగా పనిచేస్తాయని, యాపిల్స్ కూడా తినొచ్చని చెబుతున్నారు. ఇక మసాలాలు, పులుపు లేని తేలికపాటి ఆహారం తినటం మంచిదని అంటున్నారు. నీటిని ఎక్కువగా తాగాలని చెప్తున్నారు. కారం తక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలని చెబుతున్నారు. విరేచనాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు కొబ్బరి నీళ్లను తాగితే మంచిదని కొబ్బరి నీళ్లలో ఉండే పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తాయట. విరేచనాల వల్ల శరీరంలో పోయిన నీటి శాతాన్ని కొబ్బరినీరు పూరిస్తుంది అని చెబుతున్నారు. కొబ్బరి నీళ్ళు శరీరానికి కావాల్సిన శక్తిని కూడా ఇస్తాయని చెప్తున్నారు. అంతేకాదు మజ్జిగ అన్నిటికంటే ఎక్కువ ప్రభావవంతంగా మన జీర్ణవ్యవస్థను దారిలోకి తెస్తుందని చెబుతున్నారు. మజ్జిగ కడుపులో కావలసిన మంచి బాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాని బయటకు పంపిస్తుందని, అయితే పుల్లటి మజ్జిగను ఈ సమయంలో తాగకూడదని, తాజాగా ఉన్న మజ్జిగ వల్ల త్వరగా విరేచనాల సమస్య నుంచి బయటపడవచ్చని చెబుతున్నారు.

note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్న వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.