Site icon HashtagU Telugu

Flaxseeds: బరువు తగ్గాలి అనుకుంటున్నారా.. అయితే అవిసె గింజలు తినాల్సిందే..?

Flax Seeds Benefits

Flaxseeds

అవిసె గింజలు ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను చేకూరుస్తాయి అన్న విషయం తెలిసిందే. అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి. మరి ముఖ్యంగా అవిసె గింజలు బరువును తగ్గించడంలో ఎంతో బాగా సహాయపడతాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, లిగ్నాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఈ అంశ గింజలు ప్రతిరోజు తినడం వల్ల జీవ క్రియలను నియంత్రించడంతోపాటు బరువును కూడా ఫాస్ట్ గా తగ్గిస్తుంది.

అధిక బరువును తగ్గించడంతోపాటు క్యాన్సర్,గుండె జబ్బులు, టైపు 2డయాబెటిస్ వంటి వ్యాధులను బారిన పడకుండా సహాయపడుతుంది. అయితే చాలామంది బరువును తగ్గడానికి అవిసె గింజలను రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే అవిసె గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. తద్వారా తినాలి అన్న కోరిక తగ్గి ఈజీగా బరువు తగ్గుతారు. అలా అని అవిసె గింజలను పరిమితికి నుంచి తింటే ఎన్నో రకాల సమస్యలు కూడా వస్తాయి. ఈ అవిసె గింజలలో ముడి లేదా పండని విత్తనాలను అసలు తినకూడదు.

ఇవి జీర్ణక్రియ ప్రక్రియను అంతరాయం కలిగించి శరీరాన్ని దెబ్బతీసే విషయాన్ని కూడా ఉత్పత్తి చేస్తాయి. పరిమితికి మించి తినడం వల్ల వెన్నునొప్పి పక్షవాతం వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే వీటిని మోతాదులో తినడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. బరువు తగ్గాలి అనుకున్న వారు అవిస గింజలను తినడం మంచిదే కానీ పరిమితికి మించి తినకూడదు. అటువంటి విషయాలలో సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను, నిపుణులను సంప్రదించడం మంచిది. అవిసె గింజలను క్రమం తప్పకుండా తింటే ముక్కు నుంచి రక్తస్రావం ఎక్కువగా అవుతుంది. కాబట్టి అవిసె గింజలను తక్కువగా తీసుకోవాలి నిపుణుల మీరు పూత ఎక్కువగా తీసుకోవడం మంచిది.

Exit mobile version