Health Tips: ఎండు చేపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మీకు తెలుసా?

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు చేయడానికి అవసరమైన

  • Written By:
  • Publish Date - June 30, 2024 / 08:45 AM IST

చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. తరచుగా చేపలు తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు చేయడానికి అవసరమైన ఎన్నో రకాల పోషకాలు కూడా అందుతాయి. అయితే మార్కెట్లో మనకు పచ్చి చేపలు అలాగే ఎండు చేపలు ఇలా రెండు రకాల చేపలు లభిస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం మంది పచ్చి చేపలు తెచ్చుకుని తింటూ ఉంటారు. కేవలం కొన్ని ప్రదేశాలలో కొంతమంది మాత్రమే ఈ ఎండు చేపలతో కూరలు చేసుకుని తింటూ ఉంటారు. ఎండు చేపల పేరు వినగానే చాలామంది ముక్కు మూసుకుంటూ ఉంటారు.

ఎందుకంటే వాటి నుంచి వచ్చే వాసన చాలా భయంకరంగా ఉంటుందని వాటిని తినడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఎండు చేపలతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ఇంతకీ ఎండు చేపల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఎండు చేపలలో పుష్కలంగా ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫాస్ఫరస్, సెలీనియం, నియాసిన్, విటమిన్ బి 12, సంతృప్త కొవ్వు ఆమ్లాలు, కేలరీలు, సోడియం ఉంటాయి. ఎండు చేపలను తినడం వల్ల శరీరం పొడిబారడం తగ్గుతుంది.

అంతేకాదు రక్తపోటును, నరాల సమస్యలు ఎండు చేపలు నియంత్రిస్తాయి. కండరాల నిర్మాణానికి ఎండు చేపలు దోహదం చేస్తాయి. అదేవిధంగా ఎండు చేపలలో ఉండే పొటాషియం నాడీ వ్యవస్థను, కండరాలను, గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. మరి ముఖ్యంగా ఎండు చేపలు గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచి చేస్తాయి. ఎండు చేపలలో పాస్పరస్ పుష్కలంగా ఉండడం వల్ల శరీరంలో ఎముకలు పుష్టిగా ఉంటాయి. అంతే కాదు దంతాల నిర్మాణాన్ని నిర్వహించడానికి కూడా ఎండు చేపలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఎండు చేపలలో ఉండే విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల పెరుగుదలకు ఎంతగానో ఉపయోగపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఎండు చేపల్లో పుష్కలంగా ఉంటాయి. ఎండుచేపల వాసన పక్కనబెట్టి తరచుగా తినడం అలవాటు చేసుకోండి.