Health Tips: రాత్రిపూట అన్నం తింటున్నారా.. కలిగి నష్టాలు ఇవే?

  • Written By:
  • Updated On - March 25, 2024 / 03:36 PM IST

మనం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నో రకాల ఆహార పదార్థాలు,పానీయాలు, పండ్లు తీసుకుంటూ ఉంటాము. ఇవన్నీ ఎన్ని తిన్నా కూడా కనీసం ఒక్క పూట అయినా సరే అన్నం తినందే ఆరోజు తిన్నట్టు అనిపించదు. అన్నం లేదంటే ముద్ద గోబీ రైస్, ఫ్రైడ్ రైస్ లాంటివి ఇలా ఏదో రూపంలో మనం అన్నాన్ని తీసుకుంటూ ఉంటాం.. ఆహారంలో భాగంగా అన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ అన్నాన్ని అధికంగా తినడం వల్ల, మరీ ముఖ్యంగా రాత్రి పూట అన్నం తినడం వల్ల, అనేక ఇబ్బందులు కలుగుతాయట. మరి రాత్రిపూట అన్నం తింటే ఏం జరుగుతుంది ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం..

రాత్రి పూట అన్నం తినడం వల్ల జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉంది. అన్నంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఆహారాన్ని రాత్రిపూట తీసుకోవడంతో ఊబకాయం సమస్య పెరుగుతుంది. రాత్రి పూట మనం తీసుకున్న ఆహారం జీర్ణం కాక కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు ఆస్తమాతో బాధపడే వారు రాత్రి పూట అన్నం తినడం వల్ల, వారు మరింత ఆస్తమా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అదేవిధంగా రాత్రి పూట అన్నం తినడం వల్ల డయాబెటిస్ పెరిగే అవకాశం ఉంటుంది. రాత్రి పూట అన్నం తినే వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటాయి.

మధుమేహ బాధితులుగా మారకూడదు అనుకుంటే, లేదా మధుమేహం నియంత్రించాలి అనుకుంటే రాత్రిపూట అది తినకూడదు. రాత్రి ఆలస్యంగా అన్నం తిన్నా అనారోగ్య సమస్యలు వస్తాయి. రాత్రి అన్నం తిన్న తర్వాత వెంటనే నిద్రపోతే శ్వాసకోస వ్యవస్థ పై పడుతుంది. ఫలితంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతుంది. రాత్రి పూట అన్నం తినడం వల్ల సోమరితనం, బద్ధకం పెరుగుతుంది. ఇది మన దినచర్య పై కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. రాత్రిపూట అన్నం తినడం వల్ల కార్బోహైడ్రేట్లు పెరుగుతాయి. శరీరంలో అదనంగా కార్బోహైడ్రేట్లు పెరగడం వల్ల, కొవ్వు పేరుకుపోవడం వల్ల ఎముకలు బలహీనంగా మారతాయి. అందుకే బరువు తగ్గాలి అనుకున్నా, డయాబెటిస్ నియంత్రణలో ఉండాలి అనుకున్నా రాత్రి పూట అన్నం తినడం మంచిది కాదు..