Health Tips: కంటి చూపు మెరుగుపడాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడాని

  • Written By:
  • Publish Date - June 27, 2024 / 04:38 PM IST

ప్రస్తుత రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం. సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు సమస్య మొదలవుతుంది. అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. అయితే ఒకవేళ కంటి చూపు సమస్య ఉంటే ఆ కంటిచూపు మెరుగుపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఎక్కువసేపు లాప్టాప్ ముందు, మొబైల్ ఫోన్లను చూస్తూ ఉండకూడదు. అలా ఎక్కువ సేవు వాటి ముందు ఉండేవారి కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకవేళ కంప్యూటర్, లాప్టాప్ ఉపయోగించే వాళ్లు కళ్ళ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అలాగే కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పౌష్టిక ఆహారాలను తీసుకోవాలి. క్యారెట్ లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇందులో తగినంత విటమిన్ ఏ కూడా ఉంటుంది. అలాగే చేపలు కూడా మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చేపలను ఎక్కువగా తినడం వల్ల దృష్టి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కంటికి సంబంధించిన సమస్యల నుండి బ్రోకలీ మనకు ఉపశమనాన్ని ఇస్తుంది.

బ్రోకలీ లో ఉండే లూటిన్, జియాక్సంతిన్ వంటి మూలకాలు కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ద్రాక్ష పండ్లను ప్రతిరోజు తినడం వల్ల కూడా కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. కంటి చూపును పెంచడంలో జామ పండు కూడా చాలా ప్రయోజనకరంగా చెప్పవచ్చు. పచ్చి కూరగాయలు,ఆకు కూరలు ఎక్కువగా తినటం కూడా కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. విటమిన్ సి, విటమిన్ ఎ పుష్కలంగా ఉండే నారింజ కూడా కంటి చూపును మెరుగుపరుస్తుంది.