Health Tips: అధిక బరువుతో ఇబ్బంది పడుతుంటే రోజు ఈ 4ఆకులు తినాల్సిందే?

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 06:08 PM IST

ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.. అయితే ఈ అధిక బరువు సమస్య నుంచి బయటపడటం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే డైట్ నీ ఫాలో అవ్వడం, వ్యాయామం చేయడం లాంటివి కూడా ఒకటి. వీటితోపాటుగా మరికొన్ని జాగ్రత్తగా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. అయితే అందుకోసం నిత్యం మనం కొన్ని ఆకులను ఖచ్చితంగా మన ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. ఇంతకీ ఆ ఆకులు ఏవి వాటిని ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో శరీర బరువును తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.

ప్రతిరోజు మన ఆహారంలో పుదీనాను చేర్చుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ఆకలిని తగ్గించే గుణాలు ఉండటంతో పాటు, త్వరగా బరువు తగ్గించే లక్షణం కూడా ఉండటంతో, బరువు తగ్గాలి అనుకునేవారు పరిమితంగా పుదీనా ఆకులను తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కరివేపాకులో బరువులు తగ్గించే మంచి లక్షణాలు ఉన్నాయి, కరివేపాకులో 1000 రకాల రోగాలను తగ్గించే మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. కరివేపాకును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.

ఉదయాన్నే నిద్రలేచి ఖాళీ కడుపుతో కరివేపాకుని తింటే బరువు తగ్గడంతో పాటు, షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి.వాము ఆకులలోనూ బరువును తగ్గించే మంచి లక్షణాలు ఉన్నాయి. వాము ఆకుల్లో ఉండే పాలీ ఫినాల్స్ రక్తంలో ఉండే చెక్కర స్థాయిని మియంత్రించటంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తాయి. దీనివల్ల బరువు కూడా తగ్గుతుంది . మలబద్ధకాన్ని తగ్గించే శక్తి వాము ఆకులో ఉంటుంది. ఖాళీ కడుపుతో వాము ఆకు తినడం వల్ల బాగా బరువు తగ్గుతారు. అలాగే పార్స్లీ ఆకు కొత్తిమీరను పోలి ఉంటుంది. ఇది బరువు నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరికైనా శరీరంలో ఫైబర్ లోపం ఉంటే ఆ లోపం తగ్గించడానికి పార్స్లీ ఆకు ఉపయోగపడుతుంది. ఇది మన బరువును బాగా నియంత్రిస్తుంది. అయితే పైన పేర్కొన్న నాలుగు ఆకులు బరువు తగ్గించే ఆకులు. అయితే వీటిని నిత్యం పరిమితంగా తీసుకోవాలి. అలా కాకుండా బరువు తగ్గాలని ఎక్కువగా తీసుకుంటే అనవసరపు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.