Site icon HashtagU Telugu

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆఫీసుకు వెళ్తున్నారా… అయితే ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి!

Pregnancy Tips

Pregnancy Tips

మామూలుగా ప్రెగ్నెన్సీ గా ఉన్నప్పుడు స్త్రీలు ఎక్కువగా టైడ్ అవుతూ ఉంటారు. తక్కువ పని చేస్తూ ఎక్కువ విశ్రాంతి తీసుకోమని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. బరువైన పనులు చేయకూడదని చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తే తప్ప ఇల్లు గడవని పరిస్థితి. అటువంటి వారు గర్భవతి అయినా సరే ఆఫీసులకు వెళుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీ సమయంలో గంటల తరబడి పొజిషన్ లో కూర్చొని ఆఫీస్ లో పనిచేస్తూ ఉంటారు. ఇలా ఎక్కువ సేపు గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చుని పనిచేయడం వల్ల తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అలాంటి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రెగ్నెంట్ స్త్రీలు ఆఫీస్ కు మీరే డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నట్లయితే కేవలం రెండో నెల వరకు మాత్రమే ఇలా వెళ్లవచ్చట. మూడో నెల పడినప్పటి నుంచి ఇలా చేయడం మంచిది కాదని డ్రైవింగ్ చేయడం వల్ల చాలా రకాల అసౌకర్యాలు కలుగుతాయని అలా మీరు ఒక్కరే ప్రయాణించడం కూడా మంచిది కాదని చెబుతున్నారు. అలాగే మీరు ఒక్కరే ప్రయాణించడం సేఫ్ కాదు. అందుకే ఇలాంటి సమయంలో మీరు ఒక డ్రైవర్ ను నియమించడం లేదా ఇంటి వాళ్లను ఆఫీసుదాకా తీసుకెళ్లడం మంచిదని చెబుతున్నారు. ముఖ్యంగా రద్దీగా ఉండే పబ్లిక్ పేస్ల్లోకి వెళ్ళడం చాలా వరకు తగ్గించాలని చెబుతున్నారు. ఎందుకు అంటే రద్దీగా ఉన్న ప్రదేశాలలో మనుషులు వెళ్లడానికి కూడా ప్లేస్ ఉండదు. కాబట్టి అలాంటి ప్రదేశాలలోకి నిండు గర్భిణీలు వెళ్లకపోవడమే మంచిది అని చెబుతున్నారు.

మీ ఇంటికి, ఆఫీసుకు మధ్య దూరం ఎక్కువగా ఉన్నట్టైతే మధ్యలో టీ, కాఫీలను తాగడం మానుకోవాలి. ఎందుకంటే దీనివల్ల మీరు పదే పదే టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుంది. దారిలో వేరే మార్గం లేకపోతే టాయిలెట్ ఆపాల్సి ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కాదట. ఆఫీసులో వికారంగా, వాంతులు వచ్చినట్టుగా అనిపిస్తే అల్లం, నిమ్మకాయను వెంట ఉంచుకోవడం మంచిది. ఎక్కువ సేపు సీట్లో కూర్చోకూడదు. కాబట్టి అప్పుడప్పుడూ సీట్లోంచి లేచి నడుస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుందట. అలాగే కాళ్లలో రక్త ప్రసరణ కూడా సక్రమంగా ఉంటుందట. కాళ్ల వాపు వచ్చే అవకాశం కూడా తగ్గుతుందని చెబుతున్నారు. అలాగే ఖాళీ కడుపుతో అంటే ఏమీ తినకుండా ఆఫీసుకు వెళ్లకూడదు. ఇది మిమ్మల్ని బలహీనంగా చేస్తుందట. మీ కడుపులో ఉన్న మీ బిడ్డ ఆరోగ్యానికి కూడా మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఆఫీసులలో మూడో నెల నుంచి కంఫర్టబుల్గా ఉండే కుర్చీలో మాత్రమే కూర్చోవాలట. అలాగే మీరు కాళ్లు వేలాడదీసి ఎక్కువ సేపు కూర్చోకూడదట. పాదాలకు మద్దతు ఇవ్వడానికి కుర్చీ కింద ఒక స్టూల్ ను పెట్టడం వల్ల పాదాల వాపు వచ్చే సమస్య ఉండదట.