Health Tips: తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా? జరిగేది తెలిస్తే షాక్‌ అవుతారు?

Health Tips: మనలో చాలా మందికి భోజనం తింటున్నప్పడు నీళ్లు తాగడం అలవాటుగా మారి ఉంటుంది. అలాగే ఏవైనా పండ్లు తిన్నప్పుడు కూడా వెంటనే నీళ్లు తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే, దీని వల్ల ఎలాంటి ఫలితాలుంటాయో చాలా మందికి తెలియదు. రోజూ శరీరానికి తగిన మోతాదులో నీళ్లు అవసరం. కానీ, ఆహారం తీసుకొనే సమయంలో నీళ్లు తాగడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం చాలా అవసరం. అలాగే తాగే నీరు విషయంలోనూ […]

Published By: HashtagU Telugu Desk
Health Tip

Health Tip

Health Tips: మనలో చాలా మందికి భోజనం తింటున్నప్పడు నీళ్లు తాగడం అలవాటుగా మారి ఉంటుంది. అలాగే ఏవైనా పండ్లు తిన్నప్పుడు కూడా వెంటనే నీళ్లు తాగడం అలవాటుగా ఉంటుంది. అయితే, దీని వల్ల ఎలాంటి ఫలితాలుంటాయో చాలా మందికి తెలియదు. రోజూ శరీరానికి తగిన మోతాదులో నీళ్లు అవసరం. కానీ, ఆహారం తీసుకొనే సమయంలో నీళ్లు తాగడం మంచిది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం చాలా అవసరం. అలాగే తాగే నీరు విషయంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి. వేసవి కాలం అయితే కనీసం ఐదు లీటర్ల వరకు నీటిని తీసుకోవాలని చెబుతుంటారు. చలికాలంలో కాస్త తక్కువ నీటిని తీసుకుంటూ ఉంటారు. కనీసం రోజూ రెండు నుంచి మూడు లీటర్లు నీరు తాగాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అది ఏ సీజన్‌ అయినా వర్తిస్తుందని చెబుతున్నారు.

ఫ్రూట్స్‌ తింటున్న సమయంలో నీరు తాగరాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వాటిలో పుచ్చకాయ ఒకటి. పుచ్చకాయ తింటే దాదాపు 90 శాతం అందులో నీరు ఉంటుంది. మళ్లీ తాగాల్సిన పని లేదు. ఇలా పుచ్చకాయ తిని నీళ్లు తాగితే జీర్ణ సమస్య ఏర్పడుతుందంటున్నారు. మరోవైపు బత్తాయి, ఉసిరి వంటి సిట్రస్‌ కలిగిన ఫ్రూట్స్‌ తినడం వల్ల శరీరానికి విటమిన్‌ సి అందుతుంది. ఇదే సమయంలో నీరు తాగడం వల్ల సమస్యలు ఏర్పడతాయి. వీటిని తిన్న వెంటనే నీరు తాగితే pH స్థాయిని మరింత దిగజార్చినట్లవుతుందని నిపుణులు చెబుతున్నారు.

అరటిపండు తిన్నాక నీరు తాగితే..
అరటిపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ పండు తిన్న వెంటనే నీరు తాగకుండా ఉండాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొనాల్సి వస్తుందంటున్నారు. అరటి పండు తిన్నాక కనీసం అరగంట పాటు నీళ్లు తాగరాదని చెబుతున్నారు. పాలు తాగిన వెంటనే కూడా నీళ్లు తాగరాదని చెబుతున్నారు. ఇది అసిడిటీకి దారి తీస్తుందట. మరోవైపు టీ, కాఫీ లాంటివి తాగిన తర్వాత నీరు తాగినా ఇదే జరుగుతుందంటున్నారు.

  Last Updated: 19 Dec 2022, 07:50 PM IST