Site icon HashtagU Telugu

Curd : ప్రతిరోజు పెరుగు తింటే బరువు పెరుగుతారా? నిపుణులు ఏం చెబుతున్నారంటే

Mixcollage 22 Jan 2024 02 32 Pm 4492

Mixcollage 22 Jan 2024 02 32 Pm 4492

పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. చాలామంది ఉదయం అలాగే రాత్రి సమయంలో కచ్చితంగా ఒక్కసారైనా పెరుగును తీసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి పెరుగు లేకుండా ముద్ద కూడా దిగదు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా పెరుగుతోనే తింటూ ఉంటారు. పెరుగును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. పెరుగు లేకుంటే చాలామందికి ముద్దే దిగదు. అయితే చాలామంది ప్రతిరోజూ పెరుగును తింటే బరువు పెరుగుతారని అంటూ ఉంటారు.

మరి నిజంగానే పెరుగు తింటే బరువు పెరుగుతారా ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగును తినడం వల్ల గుండె సమస్యలు తగ్గుతాయి. రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అయితే పెరుగును ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు అనే అపోహ చాలామందిలో ఉంటుంది. అయితే అది ఏమాత్రం నిజం కాదు. ఎందుకంటే పెరుగు తింటే అస్సలు బరువు పెరగరు. బరువు తగ్గుతారు. పెరుగులో ఉండే పోషకాలు బరువును తగ్గించేందుకు తోడ్పడతాయి. పెరుగులో ఉండే ప్రొటీన్స్ కు బరువు తగ్గడానికి ఉపయోగపడుతాయి.

ఈ ప్రొటీన్ ఆకలిని తగ్గిస్తుంది. దీనివల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. పెరుగులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం లాంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అలాగే విటమిన్ బీ2, విటమిన్ బీ12 ఇందులో ఉంటాయి. పెరుగు జీర్ణక్రియను మెరుగు పరిచి జీవక్రియ రేటును పెంచుతుంది. నిత్యం ఒక కప్పు పెరుగును తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. కాబట్టి పెరుగు తింటే బరువు పెరుగుతారు అన్నది కేవలం అపోహ మాత్రమే.