Curd: పెరుగు వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసా.!

  • Written By:
  • Publish Date - March 23, 2024 / 09:45 PM IST

పెరుగు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. చాలామంది ఉదయం అలాగే రాత్రి సమయంలో కచ్చితంగా ఒక్కసారైనా పెరుగును తీసుకుంటూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే చాలా మందికి పెరుగు లేకుండా ముద్ద కూడా దిగదు. మరి ముఖ్యంగా చిన్న పిల్లలు ఎక్కువగా పెరుగుతోనే తింటూ ఉంటారు. పెరుగును తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి పెరుగుతో ఇంకా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు శరీరానికి అవసరమైన విటమిన్లు , అనేక ఇతర పోషకాలు కూడా లభిస్తాయి.

ప్రతిరోజు ఒక స్పూను పెరుగు తింటే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. పెరుగు తినడం వల్ల ఒత్తిడి తగ్గి మెదడు బాగా పని చేస్తుంది. పెరుగు ఆరోగ్యాన్ని మాత్రమే కాదు అందాన్ని కూడా ఇస్తుంది. పెరుగు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. పెరుగు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పెరుగు శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. డీ హైడ్రేషన్ నుంచి కాపాడుతుంది. ప్రతిరోజు పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి దూరంగా ఉండడానికి పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. హెయిర్ ఫాలికల్స్ నుంచి చర్మాన్ని మృదువుగా చేయడానికి పెరుగు పనికొస్తుంది.

ప్రతిరోజూ పెరుగును మధ్యాహ్నం పూట ఒక కప్పు తినడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. పెరుగు తినడం వల్ల నిద్ర సమస్యలు తగ్గుతాయి. పెరుగు చర్మం యొక్క అందాన్ని కూడా పెంచడానికి పలు రకాలుగా పనిచేస్తుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా పెరుగు ఉపయోగపడుతుంది. కాబట్టి పెరుగు తినడం ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరూ పెరుగు తినాలి. ముఖ్యంగా వేసవి కాలంలో పెరుగు తినడం వల్ల ఇంకా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి..