చాలామందికి సీజన్ తో సంబంధం లేకుండా నోటిపూత సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ నోటిపూత సమస్య కారణంగా వేడి పదార్థాలు తినడానికి తాగడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోటిపూత సమస్య చర్మం దద్దుర్లు బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వాటి వల్ల వస్తూ ఉంటుంది. అలాగే మనం తీసుకునే ఆహారం మన శరీరానికి పడకపోవటం వలన హార్మోన్ల అసమతుల్యత వలన విటమిన్ ఐరన్ లోపాల వలన కూడా నోటి పూత రావచ్చని చెబుతున్నారు. ఈ సమస్య కొన్ని కొన్ని సార్లు తీవ్రమై నోరు అంతా పాకి నాలుక పెదవులు దవడల ప్రదేశంలో ఈ నోటి పూత సమస్య వస్తూ ఉంటుంది.
అలాంటప్పుడు తేనెని పోయడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందట. తేనే పసుపు కలిపి నోటి పూత ఉన్న ప్రదేశంలో పెడితే తప్పకుండా త్వరగా ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అదేవిధంగా బియ్యం కడిగిన నీళ్లలో పటిక బెల్లాన్ని కలిపి తీసుకుంటే నోటీసులు పూజా సమస్య నుంచి బయటపడవచ్చట.. కొత్తిమీరను కషాయం రూపంలో తయారు చేసుకొని నోట్లో పోసుకొని పుక్కిలించడం వల్ల కూడా ఈ సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు అని చెబుతున్నారు. అలాగే తమలపాకులు నమిలి తినడం వల్ల కూడా నోటి పూత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందట. గ్లిజరిన్ ను కూడా నోటిపూతపై అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుందట.
నోటిపూత సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు కారానికి బదులుగా పెరుగన్నం లేదా పండ్లు ఆకుకూరలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. నోటి పూత ఉన్న వాళ్ళు వాటిపై నెయ్యి అప్లై చేయడం లేదా నెయ్యి పదార్థాలు తినడం వల్ల కూడా త్వరగా ఉపశమనం లభిస్తుందట. ఈ సమయంలో మాంసాహారాన్ని దూరంగా ఉంచడం చాలా మంచిదని, సాధారణంగా నోటిపూత 10 నుంచి 15 రోజుల లోపల తగ్గిపోతుంది అలా కాని పక్షంలో వైద్యుడిని సంప్రదించటం మంచిది. ఎందుకంటే దీర్ఘకాలం నోటి పూత కానీ నోటి కురుపులు కానీ నోటికి ఆన్సర్ కి దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు.