ప్రస్తుత రోజుల్లో చాలా మంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. కల్తీ ఎక్కువగా ఉన్న నూనెల వాడకం, వంటల్లో నూనెల అధిక వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, బయట జంక్ ఫుడ్ కు అలవాటు పడడం, ఫాస్ట్ ఫుడ్స్ తినడం వంటి ఇలా ఎన్నో రకాల ఆహారపు అలవాట్లు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతున్నాయి. ప్రస్తుతం ప్రతి ఒక్కరిలోను కొలెస్ట్రాల్ సమస్య అన్నది తీవ్ర సమస్యగా పరిణమిస్తోంది. అయితే చాలామంది కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చికెన్, మటన్ వంటి నాన్వెజ్ తినకూడదు అని చెబుతూ ఉంటారు.
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే చికెన్ తినవచ్చా? తినకూడదా? ఒకవేళ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మాంసం తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది చికెన్ విషయంలో చికెన్ ఉడికించే దాన్నిబట్టి ఆధారపడి ఉంటుంది. సాధారణంగా చికెన్ ను చాలా ఎక్కువ నూనెలో వండితే అది కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతుంది. ఇక చికెన్ ను ఇష్టంగా తినేవారు చికెన్ ఫ్రై, కడాయి చికెన్, చికెన్ డీప్ ఫ్రై, బటర్ చికెన్ వంటి వాటిని తింటే కొలెస్ట్రాల్ విపరీతంగా పెరుగుతుంది. ఇక బ్లడ్ లో చెడు కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే వండుకొని తినే విధానమే మెయిన్ అంటున్నారు.
చికెన్ సూప్ చేసుకున్న నూనె లేకుండా చికెన్ ను ఉడకబెట్టుకుని తిన్న లేదా తక్కువ నూనెతో తయారుచేసిన తందూరి చికెన్, బొగ్గుపై కాల్చిన బార్బిక్యూ చికెన్ వంటివి తిన్నా ఆరోగ్యానికి హాని కలుగదు. ఎంత చికెన్ పై ఇష్టం ఉన్నప్పటికీ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ఇంకా కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు వారానికి ఒకసారి మాత్రమే చికెన్ తినాలి. అలాకాకుండా తరచూ నూనెలో డీప్ ఫ్రై చేసిన చికెన్ తింటే మాత్రం సమస్యలు తప్పవు.