Dates: షుగర్ ఉన్నవారు ఖర్జూర పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

  • Written By:
  • Publish Date - March 30, 2024 / 06:00 PM IST

ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం, తగ్గడం లాంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. రక్తంలో షుగర్ లెవల్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే రకరకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు.

అటువంటి వాటిలో ఖర్జూర పండ్లు కూడా ఒకటి. షుగర్ ఉన్నవారు ఖర్జూరాలు తినొచ్చా? డయాబెటిస్ పేషెంట్లు తింటే రోజుకు ఎన్ని పండ్లు తినొవచ్చు? ఎక్కువ తింటే ఏమవుతుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఖర్జూరాలతో బోలెడు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఖర్జూరాల్లో డైటరీ ఫైబర్ తో పాటు, విటమిన్ ఏ, విటమిన్ బీ, విటమిన్ బీ6, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ కె, కాపర్, నియాసిన్, ఐరన్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అయితే ఇవి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ డయాబెటిస్ బాధితులు ఖర్జూరాలను రోజుకు రెండు మాత్రమే తినాలి. మితంగా తింటే పర్లేదు కానీ బాగా ఎక్కువగా తినకూడదు. ఖర్జూరాలు తియ్యగా ఉన్నప్పటికీ, వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ రోగులకు ఎలాంటి సమస్యని కలిగించదు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటే, రక్తంలో చక్కెరలో ఆకస్మిక పెరుగుదల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖర్జూరాలు కాస్త లిమిట్ లో తినవచ్చు. అలా కాకుండా ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది. ఇంకా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఖర్జూరాలు తినటం వలన డయాబెటిస్ కంట్రో లో ఉండటమే కాకుండా బరువు తగ్గుతారు. అధిక రక్తపోటు తగ్గుతుంది.