Health Tips: బ్రౌన్ రైస్, వైట్ రైస్ లలో ఏది మంచిది.. ఎందుకో తెలుసా?

సాధారణంగా చాలామంది వైట్ రైస్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. మరికొందరు బ్రౌన్ రైస్ ని తింటూ ఉంటాను.

  • Written By:
  • Publish Date - November 29, 2022 / 08:00 AM IST

సాధారణంగా చాలామంది వైట్ రైస్ ని ఎక్కువగా తింటూ ఉంటారు. మరికొందరు బ్రౌన్ రైస్ ని తింటూ ఉంటాను. ఇంకొందరు బ్రౌన్ రైస్ ని, వైట్ రైస్ ని రెండిటిని తింటూ ఉంటారు. అయితే ఈ రెండిట్లో ఏది ఆరోగ్యానికి మంచిది అన్న విషయం చాలామందికి తలెత్తుతూ ఉంటుంది. ఆ విషయంలోకి వెళితే.. వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి చాలా మంచిది. బ్రౌన్ రైస్ లో కేలరీలు, ప్రోటీన్, క్రొవ్వు ఫైబర్ కంటెంట్ లు అధికంగా ఉంటాయి. వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్  రైస్ లో ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అందుకే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ చాలా మంచిది అని అంటూ ఉంటారు.
అయితే వైట్ రైస్ ను తినడం వల్ల గ్లూటెన్ అలెర్జీ, ఉదర సంబందిత వ్యాధులను తగ్గించడడంలో ఎంతో బాగా పనిచేస్తుంది.

అంతేకాకుండా వైట్ రైస్ తేలికగా జీర్ణం అయ్యి చర్మం చుట్టూ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాగే వైట్ రైస్ లో పిండి పదార్థం గ్లైసెమిక్ ఇండెక్స్ పుష్కలంగా లభిస్తాయి. సోడాలు, పండ్ల రసాలు, తీపి అల్పాహారం, తృణధాన్యాలు, మిఠాయి, వైట్ బ్రెడ్ వైట్ రైస్ వంటి వాటిలో గ్లైసెమిక్ అధిక మొత్తంలో ఉంటుంది. ఈ ఆహారాలు ఇతర ఆహారాల కంటే రక్త స్థాయిలను సులభంగా పెంచుతాయి. వైట్ రైస్ లో గ్లూటెన్ ఉండదు. ఇది ఎక్కువగా జంక్ ఫుడ్ లో ఉంటుంది. అయితే వైట్ రైస్ చాలా హైపోలార్జెనిక్ ఆహారం. దీనిని తినడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు. బ్రౌన్ రైస్‌లోని మెగ్నీషియం, కాల్షియం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఒక కప్పు బ్రౌన్‌రైస్‌‌లో 21 శాతం మెగ్నీషియం ఉంటుంది.

బ్రౌన్ రైస్ వల్ల అధిక బరువు నియంత్రణలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు వైట్‌ రైస్‌కు బదులు బ్రౌన్‌ రైస్ తీసుకుంటే మంచిది. గుండెపోటు, చక్కెర వ్యాధికి కారణమయ్యే మెటబాలిక్ సిండ్రోమ్‌ను బ్రౌన్ రైస్ నియంత్రిస్తుంది. కాబట్టి వైట్ రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ మంచిది. అలాగే బ్రౌన్ రైస్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు శరీరంలో చక్కెర నియంత్రణకు బ్రౌన్‌ రైస్‌ను వారానికి రెండు లేదా మూడు రోజులు సార్లు తీసుకోవాలి..మతిమరుపు, అల్జీమర్స్, డిమోన్షియా లాంటి వ్యాధులను బ్రౌన్ రైస్ దూరం చేస్తుంది.