మనలో చాలామందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. పెరుగు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. పెరుగు తరచుగా తీసుకోవడం వల్ల ఎన్నో రకాల లాభాలు కూడా కలుగుతాయి. అందుకే నిపుణులు కూడా తరచుగా పెరుగును తీసుకోమని చెబుతూ ఉంటారు. నిజానికి పెరుగును సీజన్లతో సంబంధం లేకుండా తినవచ్చు. ఎందుకంటే ఇది ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. సమస్యల బారిన పడకుండా రక్షిస్తుంది. కొందరు ప్రతిరోజు తప్పనిసరిగా మజ్జిగ లేదా పెరుగుని తింటూ ఉంటారు. ఇంకొందరు పెరుగును తినడానికి అసలు ఇష్టపడరు.
అయితే పెరుగు తినేవారు కొంతమంది మధ్యాహ్నం సమయంలో తింటే మరికొందరు రాత్రి తింటూ ఉంటారు. అయితే మధ్యాహ్నం సమయంలో పెరుగు తింటే ఏం జరుగుతుందో ఎలాంటి ప్రయోజనాల కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెరుగు కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. స్త్రీలు పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలలో ఇది కూడా ఒకటి. పెరుగు ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను తగ్గిస్తుంది. అంతేకాదు పెరుగులో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుందట. అలాగే పెరుగును తరచుగా తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయట. పెరుగును తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గుతుందని చెబుతున్నారు.
అంతేకాదు పెరుగు కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేస్తుంది. అలాగే గుండెను బలంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన మొత్తంలో కాల్షియం అందుతుంది. అలాగే మన ఎముకలు, దంతాలు కూడా బలంగా ఉంటాయి. ఇది సయాటికా, ఇతర ఎముక సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరుగును కాలాలతో సంబంధం లేకుండా మధ్యాహ్నం పూట తినడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ ఉత్పత్తి తగ్గుతుంది. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అసమతుల్య జీవనశైలి, కార్టిసాల్ అనే హార్మోన్ లో అసమతుల్యత వల్ల నడుములో కొవ్వు పేరుకుపోతుంది.
పెరుగు కార్టిసాల్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది. అందుకే ఇది కేలరీలు తీసుకోవడాన్ని ఇది తగ్గిస్తుంది. అదేవిధంగా పెరుగులో సులబంగా జీర్ణమయ్యే ప్రోటీన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. అలాగే డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. రోజూ పెరుగును తినడం వల్ల కొరోనరీ హార్ట్ డిసీజ్ రిస్క్ తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పెరుగు ధమనుల్లో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా నివారిస్తుందట. పెరుగులో విటమిన్ ఇ, జింక్, ఫాస్పరస్ వంటి అనేక ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మన స్కిన్ కలర్, చర్మ ఆకృతిని మెరుగుపరచడానికి సహాయపడతాయని చెబుతున్నారు.
note: పైన ఆరోగ్య సమాచారం ఇంటర్నెట్ నుంచి సేకరించబడినది. ఇందులో ఎటువంటి సందేహాలు ఉన్నా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.