Site icon HashtagU Telugu

Cardamom: ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా!

Mixcollage 13 Mar 2024 11 17 Pm 9197

Mixcollage 13 Mar 2024 11 17 Pm 9197

మన వంటింట్లో దొరికే మసాలా దినుసులలో యాలకులు కూడా ఒకటి. ఈ యాలకులని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. ఇవి కేవలం రుచి పరంగానే మాత్రమే కాకుండా వాసన పరంగా కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయి. యాలకులను తరచుగా వినియోగించడం వల్ల ఎన్నో రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు. ఇందులో విటమిన్స్ తో పాటు ఫైబర్, జింక్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం లాంటి అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. నోటి దుర్వాసన లాంటి సాధారణ సమస్యలతో పాటు గుండెపోటు లాంటి అసాధారణ సమస్యలను నివారించడంలో యాలకులు కీలకపాత్ర వహిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు రాత్రి ఒక యాలకులు తిని ఒక గ్లాసు వేడి నీరు తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు పెంచుతుంది.

ఫలితంగా అధిక బరువు చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అయితే ఇన్ని పోషకాలు సమృద్ధిగా ఉండే యాలకులను ప్రతీరోజూ ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఖాళీ కడుపుతో యాలకులను తీసుకోవడం వల్ల పురుషులలో స్పెర్మ్ నాణ్యత మెరుగుపడుతుంది. స్పెర్మ్ కౌంట్ కూడా బాగా పెరుగుతుంది. లైంగిక సామర్థ్యాన్ని యాలుకలు మెరుగుపరుస్తాయి. అంతేకాదు విపరీతంగా బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి రోజు ఖాళీ కడుపుతో యాలుకలను తీసుకోవడం ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. యాలకులలో ఉండే పోషకాలు బరువును తగ్గించడంలో గణనీయంగా పని చేస్తాయి.

యాలకులలో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాల అనియంత్రిత పెరుగుదలను నిరోధిస్తాయి. క్యాన్సర్ బారి నుండి రక్షణ కల్పిస్తాయి. యాలుకలు తీసుకోవడం వల్ల స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ప్రతిరోజు ఖాళీ కడుపుతో వీటిని తీసుకుంటే వీరిలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. యాలుకలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం యాలకులలో లభించే పోషకాలు దగ్గు సమస్య నుండి ఉపశమనాన్ని అందించడంలో ఎంతో ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. చాలామంది నోటి దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు యాలుకలను నిత్యం ఖాళీ కడుపుతో తీసుకుంటే, ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న ఆహారం జీర్ణం కాక ప్రతిరోజు ఇబ్బంది పడేవారు, ఎసిడిటీతో బాధపడేవారు యాలుకలను ఖాళీ కడుపుతో తీసుకుంటే ఎసిడిటీ నుండి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. గుండె ఆరోగ్యానికి కూడా యాలుకలు ఎంతో మేలు చేస్తాయి. యాలుకలు కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగిస్తాయి. యాలుకలలో ఉండే పోషకాలతో రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. ఇలా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూర్చే యాలకులను నిత్యం మనం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు కలుగుతాయి. మన ఆరోగ్యం చాలా వరకు మెరుగు పడుతుంది. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు.