Site icon HashtagU Telugu

Health tips: బిర్యానీ ఆకుతో ఇలా చెస్తే.. షుగర్ మాయం అవ్వాల్సిందే?

Mixcollage 08 Mar 2024 10 54 Pm 948

Mixcollage 08 Mar 2024 10 54 Pm 948

ప్రస్తుత రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ డయాబెటిస్ కారణంగా ఎటువంటి ఆహార పదార్థాలు పండ్లు తినాలి అన్నా కూడా తెగ ఆలోచిస్తూ ఉంటారు. డయాబెటిస్ ని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నో రకాల మెడిసిన్స్ ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయితే కొంతమంది డయాబెటిస్ కారణంగా కాస్త తీపి ఉన్న ఆహార పదార్థాలు, పండ్లను తీసుకోవాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు. అలాగే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి అన్న కూడా భయపడుతూ ఉంటారు.

ఇక షుగర్ ని అదుపులో ఉంచుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా షుగర్ సమస్యతో బాధపడుతుంటే బిర్యానీ ఆకుతో ఇలా చేయాల్సిందే. మరి అందుకోసం ఏం చేయాలి అన్న విషయానికి వస్తే.. ఒక గిన్నెలో 10 బిర్యానీ ఆకులను తీసుకుని మూడు గ్లాసుల నీళ్లు పోసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత స్టవ్ నుంచి దించి రెండు, మూడు గంటల పాటు దానిని చల్లారనివ్వాలి. బిర్యానీ ఆకులో ఉన్న ఔషధ గుణాలు ఆ నీటిలో చేరుతాయి. ఆపై ఆకులను తొలగించి సగం గ్లాసు చొప్పున రోజుకు మూడుసార్లు బిర్యాని ఆకు తో తయారు చేసుకున్న కషాయాన్ని తాగాలి. ఒక మూడు రోజుల పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి గంట ముందుగా దీనిని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.

ఆ తర్వాత మళ్లీ రెండు వారాల పాటు గ్యాప్ ఇచ్చి, మళ్లీ వరుసగా మూడు రోజులపాటు క్రమంగా దీనిని వాడాలి. ఇలా రెండుసార్లు చేస్తే షుగర్ నియంత్రణలోకి వస్తుంది. ఇలా చేయడంతో పాటుగా షుగర్ ని కంట్రోల్ చేసుకోవాలంటే కచ్చితంగా జీవనశైలి మార్చుకోవాలి. కనీసం అరగంట నుంచి గంట పాటు వ్యాయామం చెయ్యాలి. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ తక్కువగా తీసుకోవడం, సరిపడా నిద్రపోవడం, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరిగా చెయ్యాలి. అయితే సహజసిద్ధమైన విధానాలతో డయాబెటిస్ తెగ్గించుకోవాలంటే నేచురోపతి వైద్యులను సంప్రదించాలి.

Exit mobile version