Site icon HashtagU Telugu

Sleep: గాఢ నిద్ర‌లో ఉన్న‌ప్పుడు మీరు ఆక‌స్మాత్తుగా నిద్ర లేస్తున్నారా?

Sleep

Sleep

Sleep: తరచుగా రాత్రి నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా కొంత‌మంది నిద్ర‌లో (Sleep) నుంచి లేస్తారు. ఈ సమస్య నిరంతరం జరిగితే దీనికి అనేక కారణాలు ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది మ‌న‌ శరీరానికి, మనస్సుకు కూడా హాని కలిగించవచ్చు. ప్ర‌తిరోజూ 7 నుంచి 8 గంటల నిద్ర తీసుకోవడం అవసరం. కానీ ప్రతిరోజూ పూర్తి నిద్ర పొందకపోతే ఇది మొత్తం ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది. కొంద‌రు రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోవడానికి జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం కారణం కావచ్చు. ఈ విషయంపై న్యూ ఢిల్లీకి చెందిన బాల, కిశోర ఫోరెన్సిక్ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ ఆస్తిక్ జోషి ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.

మధ్య రాత్రి నిద్ర ఆగిపోవడానికి కారణాలు

ఒత్తిడి: డాక్టర్ ఆస్తిక్ జోషి చెప్పిన ప్రకారం.. తరచుగా మధ్య రాత్రి మేల్కొంటే స‌ద‌రు వ్య‌క్తి ఒత్తిడిలో ఉండవచ్చు. ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె దడ పెరుగుతుంది. దీని వల్ల అకస్మాత్తుగా మేల్కొంటారు.

వయస్సు పెరగడం: వయస్సు పెరిగే కొద్దీ నిద్రపై ప్రభావం పడుతుంది. దీని వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుంది. ఎక్కువ సేపు మేల్కొని ఉంటారు. నిద్రపోయిన తర్వాత అకస్మాత్తుగా నిద్రలేమి స‌మ‌స్య‌లు అనుభ‌విస్తారు.
.
మందులు: నిరంతరం మందులు తీసుకుంటున్నప్పుడు ఇది మీ నిద్ర నమూనాపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కొంద‌రు మధ్య రాత్రి మేల్కొంటారు. వారికి మళ్లీ నిద్ర పట్టకపోవచ్చు. డిప్రెషన్, ADHD, అధిక రక్తపోటు వంటి మందులు నిద్రను దెబ్బతీస్తాయి.

Also Read: IND vs ENG: ఇంగ్లాండ్‌తో టీమిండియా రెండో టెస్ట్‌.. ముగ్గురూ ఆట‌గాళ్లు ఔట్‌!

ఈ స‌మ‌స్య‌ను ఎలా నివారించాలి?