Site icon HashtagU Telugu

Health Tips: బ్రేక్ ఫాస్ట్ విషయంలో అలాంటి పొరపాట్లు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త?

Mixcollage 03 Dec 2023 04 00 Pm 2441

Mixcollage 03 Dec 2023 04 00 Pm 2441

ప్రతిరోజు మనం ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటాము. పనులకు వెళ్లేవారు ఆఫీసులకు వెళ్లేవారు స్కూల్ కి వెళ్లే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయడం అన్నది తప్పనిసరి. అయితే ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి అంటున్నారు వైద్యులు. ఉదయం తీసుకునే బ్రేక్ ఫాస్ట్ రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడంతోపాటు కావాల్సిన శక్తిని కూడా అందిస్తుంది. అయితే చాలామంది బ్రేక్ ఫాస్ట్ విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అయితే వాటి వలన ఆరోగ్యం దెబ్బతింటుంది.

మరి బ్రేక్ ఫాస్ట్ విషయంలో ఎటువంటి పొరపాట్లు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బ్రేక్ ఫాస్ట్ విషయంలో చేసే తప్పుల వల్ల డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు కూడా వస్తాయి. టిఫిన్ లో ప్యాక్ చేసిన జ్యూస్ తీసుకున్నట్లయితే ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇది బరువుని విపరీతంగా పెంచుతుంది. ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ ను పెంచుతాయి. కావున ప్యాక్ చేసిన జ్యూస్ ని టిఫిన్ లో అస్సలు తీసుకోకూడదు. అలాగే చాలామంది అల్పాహారంలో శరీరానికి హాని కలిగించి పదార్థాలను తీసుకుంటూ ఉంటారు.

అలా వీటిని చేర్చుకోవడం వల్ల పొట్ట నిండుగా అనిపిస్తుంది. కానీ ఇటువంటి అల్పాహారంలో ఎటువంటి పోషకాలు ఉండవు కావున టిఫిన్ లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా తీసుకోవాలి. దీనిలో ప్రోటీన్ చేర్చుకోవడం వలన ఇది కండరాల అభివృద్ధిలో రక్తంలో షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఉదయం టిఫిన్ లో పీచు పదార్థాన్ని చేర్చకపోతే మలబద్ధక సమస్య వస్తుంది. కావున టిఫిన్ లో ఫైబర్ తప్పనిసరిగా ఉండాలి. టిఫిన్ లో పీచు పదార్థాన్ని తీసుకోవడం వలన కొలెస్ట్రాల్ కంట్రోల్ లో ఉంటుంది. అలాగే జీర్ణశక్తికి బలంగా తయారవుతుంది. మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.