Eye Sight: చిన్న వయసులోనే కళ్ళు మసకబారుతున్నాయా.. అయితే ఇలా చేయండి?

  • Written By:
  • Publish Date - March 26, 2024 / 09:29 PM IST

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది కంటిచూపు సమస్యతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. అయితే కంటి చూపు సమస్య రావడానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. వాటిలో మనం ఉపయోగించే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఆహార పదార్థాలు. సరైన పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోకపోవడం వల్ల కూడా కంటి చూపు సమస్య మొదలవుతుంది. అయితే కళ్ళు అనేవి ఎంతో ప్రధానమైనవి. కాబట్టి వీటిని మనం జాగ్రత్తగా రక్షించుకోవాలి. కంటి సమస్యలు వస్తే ఇక జీవితం అంత చీకటి మయం అవుతుంది. అయితే కంటి చూపు సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తగా పడడం కంటే రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అలాగే వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే కళ్ళు మసకబారడం లాంటి సమస్యలు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. మరి చిన్న వయసులోనే కళ్ళు మసకబారడం లాంటి సమస్యలు వస్తే అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ ఆరు బాదం పప్పులను నీళ్ళల్లో నాన పెట్టుకొని తినాలి. బాదం పప్పులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటిచూపు మెరుగయ్యేలా చేస్తాయి. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి విటమిన్ సి సమృద్ధిగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు ఉసిరికాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.

ఉసిరికాయలలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ప్రతి రోజూ ఒక గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉసిరికాయ జ్యూస్ కలుపుకొని తాగితే చాలా మంచిది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఏ ఎక్కువగా ఉండే ఆహారాలను తినాలి. పచ్చని ఆకుకూరలు, కూరగాయలతో కళ్ల ఆరోగ్యం మెరుగు పడుతుంది. పచ్చి కూరగాయలలో కెరెటోనాయిడ్స్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కళ్ళ కు మేలు చేస్తాయని చెబుతున్నారు. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలను ఎక్కువగా తినాలి. చేపలు ఎక్కువగా తినడం వల్ల కళ్లు పొడిబారే సమస్య తగ్గుతుంది. కళ్ళ ఆరోగ్యం కోసం క్యారెట్, క్యారెట్ జ్యూస్ ఎంతగానో మేలు చేస్తాయి. క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, బీటా కెరోటిన్ కళ్లకూ మేలు చేస్తాయి. ఇది కంటి చూపు పెరగడానికి దోహదం చేస్తుంది. అంతేకాదు కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే బొప్పాయి, నారింజ, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లను ఎక్కువగా తినడం మంచిది. పైన చెప్పిన చిట్కాలు తప్పకుండా పాటిస్తే కళ్ళు మసకబారడం కంటిచూపు వంటి సమస్యలను అధిగమించవచ్చు..