Site icon HashtagU Telugu

Soaked Superfoods: ఏ రోగం దరిచేరకుండా ఉండాలంటే వీటిని తీసుకోవాల్సిందే?

Soaked Foods

Soaked Foods

ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి. మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. కాబట్టి మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరగడంతో పాటు దీర్ఘకాలం ఎటువంటి అనారోగ్య సమస్యలు రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. ఎప్పుడు ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలి. మరి దీర్ఘకాలికంగా ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ప్రతి రోజు నిద్ర లేచిన వెంటనే ఏం తినాలి ఏం తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కిస్మిస్.. వీటి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న సంగతి మనందరికీ తెలిసిందే. కిస్మిస్ శరీరానికి చాలా ఆరోగ్యకరమైంది. ఇందులో పెద్దమొత్తంలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటివి ఉంటాయి. వీటిని ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరం బలహీనత దూరమౌతుంది. దాంతో పాటు హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అటు పరగడుపున కిస్మిస్ తినడం వల్ల ఇమ్యూనిటీ పటిష్టమౌతుంది. అందుకే ప్రతిరోజూ రాత్రి వేళ 6 కిస్మిస్ గింజల్ని నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున నీళ్లతో సహా తినాలి. బాదం.. బాదం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బాదంలో పోషక పదార్ధాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

ఇందులో పెద్దమొత్తంలో ప్రోటీన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ ఉదయం పరగడుపున తీసుకుంటే మెమరీ పవర్ పెరుగుతుంది. బరువు తగ్గించేందుకు సైతం దోహదపడుతుంది. అలాగే ఎండు ఖర్జూరం..
ఎండు ఖర్జూరంలో పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి చాలా ఉపయోగకరం. రాత్రి వేళ నీళ్లలో నానబెట్టి ఉదయం తినడం వల్ల శరీరానికి కావల్సినంత ఐరన్ లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా ప్రతిరోజు తీసుకుంటూ ఉండటం వల్ల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.