Site icon HashtagU Telugu

Banana Side Effects: ఆ 5 రకాల సమస్యలు ఉన్నవారు అరటి పండ్లకు దూరంగా ఉండాల్సిందే?

Banana Benefits

Banana Side Effects

అరటిపండ్ల వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న విషయం మనందరికీ తెలిసిందే. వీటిని చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఇష్టపడే తింటూ ఉంటారు.. చాలా తక్కువ మంది మాత్రమే అరటి పండ్లు తినడానికి అంతగా ఇష్టపడరు. అయితే అరటి పండ్లను తినడం మంచిదే కానీ కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు మాత్రం అరటి పండ్లకు దూరంగా ఉండాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఎటువంటి సమస్యలు ఉన్నవారు అరటి పండ్లు తినకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముఖ్యంగా అరటి పండ్లతో ఎలర్జీ ఉండేవాళ్లు పొరపాటున కూడా తీసుకోకూడదు. ఎలర్జీ ఉన్నవాళ్లు అరటి పండ్లు తినడం వల్ల స్వెల్లింగ్, శ్వాస ఇబ్బంది, ఎనాఫిలెక్సిస్ వంటి తీవ్ర లక్షణాలు ఉత్పన్నమౌతాయి. మధుమేహం…అరటి పండ్లలో సహజసిద్ధమైన పంచదార ఉంటుంది. ఫలితంగా మధుమేహం లేదా బ్లడ్ షుగర్ రోగులు పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ తినాల్సి వస్తే బాగా పండినవి అస్సలు తినకూడదు. కిడ్నీ.. అరటి పండ్లలో పొటాషియం అధిక మోతాదులో ఉంటుంది. కిడ్నీ సమస్య ఉన్న వ్యక్తులకు ఇవి హానికారకం. శరీరంలో అదనంగా ఉన్న పొటాషియం బయటకు తొలగించడంలో సమస్య వస్తుంది. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్లు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.

మలబద్ధకం.. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా అరటిపండ్లకు దూరంగా ఉండటం మంచిది.
కడుపు ఉబ్బరం లేదా మలబద్ధకం సమస్యతో బాధపడేవాళ్లు అరటి పండ్లు తినకూడదు. ఎందుకంటే అరటి పండ్లు మలబద్ధకం సమస్యను తగ్గించాల్సింది పోయి మరింత పెంచుతుంది. ఆస్తమా.. ఆస్తమా రోగులకు అరటి పండ్లు అంత మంచివి కావు. ఆస్తమా రోగులు అరటి పండ్లు తినడం వల్ల సమస్య మరింతగా పెరిగిపోతుంది. అందుకే ఆస్తమా రోగులు అరటి పండ్లకు దూరంగా ఉండాలి.