Food Habits: పరగడుపున అలాంటి ఆహారం తీసుకున్నారో.. ఇక అంతే సంగతులు?

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మానవ జీవనశైలి ఆహారపు అలవాట్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా మారిపోయాయి. మరి ముఖ్యంగా ఆహార విషయంలో మార్పుల కారణంగా చ

  • Written By:
  • Publish Date - May 15, 2023 / 06:20 PM IST

టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో మానవ జీవనశైలి ఆహారపు అలవాట్లు ఇలా ప్రతి ఒక్కటి కూడా మారిపోయాయి. మరి ముఖ్యంగా ఆహార విషయంలో మార్పుల కారణంగా చిన్న చిన్న వయసులకే అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం బాగా ఉండాలి అంతే మనం తీసుకునే ఆహారంపై తప్పకుండా శ్రద్ధను వహించాలి. ఇది ఆహారం తీసుకోవడం మంచిదే కానీ కొన్ని రకాల ఆహార పదార్థాల విషయంలో ఎప్పుడు తినాలి? ఎప్పుడు తినకూడదు అనే స్పష్టత అవసరం.

అయితే ఉదయం సమయంలో పరగడుపున కొన్ని రకాల ఆహార పదార్థాలను అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే ఉదయం ఖాళీ కడుపుతో తీసుకునే ఆహారం నేరుగా కడుపు లోపలి బాగాలపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా కడుపులో మంట, కడుపు నొప్పి, ఛాతీలో మంట, అజీర్తి వంటి సమస్యలు ఎదురవుతాయి. మరి ఉదయం వేళ పరగడుపున ఏయే పదార్ధాలు తినకూడదో తెలుసుకుందాం.. పరగడుపున మసాలా, కారం లేదా ఫ్లైడ్ పదార్ధాలు తినకూడదు. వీటవల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

అంతేకాకుండా కడుపు లేదా ఛాతీ బరువుగా అన్పించి ఇబ్బంది కలుగుతుంది. ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి. ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది. చాలామందికి బెడ్ కాఫీ లేదా బెడ్ టీ అలవాటు ఉంటుంది. అంటే లేచీ లేవగానే పరగడుపున కాఫీ లేదా టీ తాగుతూ ఉంటారు. ఇది ఏ మాత్రం మంచి అలవాటు కాదు.

ఈ అలవాటు వల్ల శరీరానికి నష్టం కలుగుతుంది. ఛాతీలో మంట, డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయం పరగడుపున నీళ్లు తాగడం చాలా మంచిది. కానీ చల్లని నీల్లు అస్సలు తాగకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు ఎదురై ఏం తిన్నా సరే కడుపులో అజీర్ణం మొదలవుతుంది. గోరువెచ్చని నీళ్లు తాగడం అత్యుత్తమం. ఇంకొందరైతే ఏకంగా పరగడుపున లేచిన వెంటనే మద్యం తాగుతుంటారు. ఇది మరింత ప్రమాదకరం. పరగడుపున ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా ప్రమాదకరం. ఇది నేరుగా మీ లివర్‌పై ప్రభావం చూపిస్తుంది.