Site icon HashtagU Telugu

Health Tips: పొరపాటున కూడా కలిపి తినకూడని పండ్లు ఇవే.. తింటే అంతే సంగతులు?

Antioxidants

Health Tips

సాధారణంగా చాలామంది ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రతిరోజు పండ్లను మంచి మంచి కాయగూరలు, ఆకుకూరలు తీసుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఫ్రూట్స్ సెపరేట్ గా కాకుండా ఫ్రూట్ సలాడ్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. అలా తినడం మంచిదే కానీ ఫ్రూట్స్ తినేటప్పుడు కొన్ని రకాల పండ్లు కలిపి అస్సలు తీసుకోకూడదు. మరి ఫ్రూట్స్ లో ఏ ఏ పండ్లను కలిపి తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఆరెంజ్-క్యారట్… ఆరెంజ్, క్యారట్ కాంబినేషన్ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఆరోగ్యానికి ముప్పు.

ఈ రెండింటినీ ఒకేసారి తీసుకోవడం వల్ల గుండె మంట సమస్య ఏర్పడుతుంది. జామ-అరటి.. ఈ కాంబినేషన్ ను కలిపి తీసుకోవడం చాలా అరుదే అయినప్పటికీ ఈ రెండింటిని మాత్రం కలిపి తీసుకోకూడదు. ఈ రెండు పండ్లను కలిపి ఒకేసారి తినడం వల్ల ఎసిడిటీ, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. పైనాపిల్- పాలు.. పైనాపిల్‌లో బ్రోమెలెన్ పోషక పదార్ధం ఉంటుంది. ఇది ఓ రకమైన ఎంజైమ్. పైనాపిల్ రసం నుంచి వస్తుంది. దీనిని పాలతో కలపడం వల్ల గ్యాస్, వాంటింగ్ సెన్సేషన్ వంటి సమస్యలు రావచ్చు.

బొప్పాయి-నిమ్మ.. చాలామందికి పండ్లపై నిమ్మరసం పిండుకునే అలవాటుంటుంది. కానీ బొప్పాయిపై పొరపాటున కూడా అలా చేయవద్దు. అంటే బొప్పాయిపై నిమ్మరసం పిండటం మంచిది కాదు. ఎందుకంటే బొప్పాయి, నిమ్మకాయ అనేది ప్రమాదకర కాంబినేషన్. అలాగే పండ్లతో కూరగాయల్ని కలిపి తీసుకోవడం కూడా మంచిది కాదు. కడుపులో విష పదార్ధంగా మారుతుంది. ఫలితంగా అజీర్తి, తలనొప్పి, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు.

Exit mobile version