Vitamin C Foods: వేసవిలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తీసుకోవాల్సిందే?

సాధారణంగా వేసవిలో చాలామంది తొందరగా డీహైడ్రేట్ బారిన పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వేసవిలో చాలామంది రక రకాల కూల్ డ్రింక్స్ పానీయాలు తీసుకుంటూ ఉం

  • Written By:
  • Publish Date - May 16, 2023 / 06:10 PM IST

సాధారణంగా వేసవిలో చాలామంది తొందరగా డీహైడ్రేట్ బారిన పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే వేసవిలో చాలామంది రక రకాల కూల్ డ్రింక్స్ పానీయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే చాలామంది ఎండ వేడి నుంచి తప్పించుకోవడానికి నిమ్మకాయ నీటిని కూడా తాగుతూ ఉంటారు. నిమ్మకాయ నీరు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా నిమ్మకాయ నీరు తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. శరీరానికి కావల్సిన తక్షణ ఎనర్జీ లభిస్తుంది.

విటమిన్ సి కొరత తీరుతుంది. కారణం నిమ్మ కాయలో విటమిన్ సి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. వేసవిలో విటమిన్ సి కొరతను దూరం చేసేందుకు తీసుకోవల్సిన కొన్ని పదార్ధాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..మిరపకాయల్ని ఎక్కువగా ఆహారం తయారీలో ఉపయోగిస్తారు. పచ్చి మిరప, ఎండు మిరప లేదా మిరియాలలో పోషక గుణాలు పుష్కలంగా ఉంటాయి. పచ్చిమిర్చి లో కావల్సినంత విటమిన సి ఉంటుంది. మీరు మీ శీరరంలో విటమిన్ సి కొరతను దూరం చేయాలంటే మిరపకాయల్ని డైట్‌లో భాగంగా చేసుకోవాలి. అలాగే విటమిన్ సి కలిగిన పండ్లలో జామపండు కూడా ఒకటి.

చాలామంది ఈ జామ పండ్లను ఇష్టంగా తింటూ ఉంటారు. జామ పండు కడుపుకు సంబంధించిన సమస్యలను దూరం చేస్తుంది. మరి ముఖ్యంగా జీర్ణ సమస్యలను దరిచేరినివ్వదు. జామకాయల్లో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. అంతేకాకుండా వీటిని తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల విటమిన్ సి కొరత ఏర్పడటం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. వేసవిలో మనకు ఎక్కువగా దొరికే కాయలలో దోసకాయ కూడా ఒకటి. డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసేందుకు దోసకాయ అద్భుతంగా ఉపయోగపడుతుంది. దోసకాయల్లో కూడా విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దాంతో పాటు ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతిరోజు దోసకాయ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు తొలగిపోతాయి.