Diabetes Diet: మధుమేహం ఉన్నవారు కొబ్బరి నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 07:15 PM IST

ప్రస్తుత రోజుల్లో ప్రతి పదిమందిలో దాదాపు 8 మంది డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ఈ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు. కాగా రోజురోజుకీ డయాబెటిస్ బారిన పడేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే డయాబెటిస్ వచ్చిన వారు ఎటువంటి ఆహార పదార్థాలు తినాలన్నా కూడా భయపడుతూ ఉంటారు. అటువంటి వాటిలో కొబ్బరినీళ్లు కూడా ఒకటి. డయాబెటిస్ పేషెంట్లు కొబ్బరి నీళ్లు తాగవచ్చా లేదా ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మామూలుగా డాక్టర్లు మధుమేహం ఉన్నవారికి స్వీట్ కి కాస్త దూరంగా ఉండమని చెబుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లు కూడా రుచిపరంగా కొద్దిగా స్వీట్‌గా ఉండటంతో మధుమేహం వ్యాధిగ్రస్థులు తినవచ్చా లేదా అని సందేహ పడుతూ ఉంటారు. కొబ్బరి నీళ్లంటే ఇష్టపడనివారుండరు. వేసవిలో దాహం తీర్చుకునేందుకు ఇంతకుమించింది లేనేలేదని చెప్పవచ్చు. కొబ్బరి నీళ్లను ఆరోగ్యకరమైన డ్రింక్‌గా పరిగణిస్తారు. ఇందులో సహజసిద్ధమైన షుగర్ ఉండటం వల్ల మధుమేహం వ్యాధిగ్రస్థులు తాగవచ్చా లేదా అనేది చాలామందికి ఉన్న సందేహం. కొబ్బరి నీళ్లను సూపర్ హెల్తీ ఫుడ్‌గా చెప్పవచ్చు.

ఇందులో కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. అదే సమయంలో కొలెస్ట్రాల్ కూడా తగ్గించుకోవచ్చు. వేసవికాలంలో కొబ్బరి నీళ్లను ఎక్కువగా సేవించడం వల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. ఇందులో ఉండే వివిధ రకాల పోషక పదార్ధాలు ఆరోగ్యానికి చాలా చాలా ప్రయోజనకరం. క్రమం తప్పకుండా కొబ్బరి నీళ్లు తాగేవారిలో ఎలక్ట్రోలైట్స్ ఇన్‌బ్యాలెన్స్ సమస్య చాలా వరకూ తగ్గిపోతుంది. కొబ్బరి నీళ్లలో నేచురల్ షుగర్ ఉన్నందున రుచిపరంగా కాస్త తీపిగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు మధుమేహం వ్యాధిగ్రస్థులకు ప్రయోజనకరం. తాగినా ఏ విధమైన సమస్య ఉండదు. వాస్తవానికి కొబ్బరి నీళ్లతో బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించవచ్చు. కొబ్బరి నీళ్ల గ్లైసోమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువ ఉంటుంది. అందుకే డయాబెటిక్ రోగులు నిరభ్యంతరంగా కొబ్బరి నీళ్లు సేవించవచ్చు.