Site icon HashtagU Telugu

Health Tips: మీరు కూడా బెల్లం తింటున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

Mixcollage 14 Jan 2024 05 29 Pm 7725

Mixcollage 14 Jan 2024 05 29 Pm 7725

బెల్లం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బెల్లాన్ని ఎన్నో రకాల వంటల్లో ఉపయోగిస్తూ ఉంటారు. బెల్లం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు విటమిన్స్ ఉంటాయి. చాలామంది తరచూ చిన్న బెల్లం ముక్కని అయినా తీసుకొని తింటూ ఉంటారు. మరి తరచుగా బెల్లం తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయాన్నే గోరు వెచ్చటి నీటితో పాలు బెల్లం తీసుకోవడం వల్ల పొట్ట క్లియర్ అవుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అలాగే ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు చిటికెలో తగ్గిపోతాయి.

అంతేకాకుండా శరీరంలోని పలు రకాల స్రావాల విడుదలకు కూడా సహాయంపడుతుంది. దాని వల్ల బరువు పెరగడానికి కారణం అయ్యే మూల కారకాన్ని దూరంగా ఉంచుతుంది. గోరువెచ్చని నీటితో పాటు బెల్లం తింటే జీర్ణ ఎంజైమ్ లు పెరిగి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. అలాగే కడ్నీ సంబంధిత వ్యాధులు దూరం అవుతాయట. బెల్లంలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, విటామిన్ బీ1, బీ6 సీ లు టాక్సిన్లను తొలగిస్తాయట. ఇందులో ఫైబర్ కూడా ఉండటం వల్లే జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అలాగే ఇందులో ఉండే పొటాషియం కంటెంట్ శరీరంలోని ఎలక్ర్టోలైట్ మరియు మినరల్ లెవెల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మెటబాలిజంను కూడా పెంచుతుంది.

అంతే కాదండోయ్ మీరు వ్యాయామం చేసేటప్పుడు అధిక మొత్తంలో చెమట వచ్చేందుకు కూడా కృషి చేస్తుంది. అయితే ప్రతిరోజూ వీటిని తాగడం వల్ల బెడ్ టీ, బెడ్ కాఫీ వంటి అలవాట్లను దూరం చేసుకోవచ్చు. మారుతున్న కాలానుగుణంగా జలుబు, దగ్గు ఫ్లూ వంటి వాటిని తగ్గించడంలో కూడా బెల్లం ముందుంటుంది. మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవాలంటే కచ్చితంగా ప్రతీ రోజు చిన్న బెల్లం ముక్కును తీసుకోవాల్సిందే. ప్రస్తుత రోజులో చాలామంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. ఈ డయాబెటిస్ సమస్య నుంచి ఉపశమనం పొందడం కోసం చాలా వరకు చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.