Site icon HashtagU Telugu

Health Tips: ఉత్తరేణి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

Mixcollage 05 Dec 2023 06 55 Pm 6516

Mixcollage 05 Dec 2023 06 55 Pm 6516

మన చుట్టూ ఎన్నో రకాల ఔషధ మొక్కలు ఉంటాయి. కానీ వాటి వినియోగం, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలియక చాలామంది వాటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటూ ఉంటారు. అలా మన చుట్టూ ఉండే మొక్కలలో ఉత్తరేణి మొక్క కూడా ఒకటి. ఒకరకంగా చెప్పాలంటే ఉత్తరేణి మొక్క వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఉత్తరేణి ఆకులతో చేసిన కషాయం కిడ్నీలని శుభ్రం చేస్తుంది. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే ఉత్తరేణి మరిగించి చల్లారాక ఆ కాషాయాన్ని తీసుకుంటే కిడ్నీకి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మూత్రం సాఫీగా వస్తాయి. ఉత్తరేణి రసంతో చర్మంపై ఉప్పు, గజ్జి, కుష్టు ఇలాంటి వాటిని కూడా నివారించుకోవచ్చు. తేలు, పాము, జర్రి ఇలాంటివి ఏమైనా విషపూరితమైనవి గనక కరిస్తే అలాంటి వాటికి ఉత్తరేణి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉత్తరేణి ఆకుల్ని తమలపాకులో పెట్టి తింటే కనుక పైల్స్ నుంచి కలిగే మంట బాధ వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఈ ఉత్తరేణి నుండి తగ్గించే ప్రయత్నం చేసుకోవచ్చు. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు పదార్థాలను కూడా కరిగించే గుణాలు ఈ ఉత్తరేణి మొక్కలో ఉంటాయి. ఈ ఆకుల రసాన్ని నువ్వుల నూనె వేసిన తర్వాత బాగా మరిగించాలి. ఆ తర్వాత రసాన్ని పొట్ట భాగంలో కొవ్వు ఉన్నచోట అప్లై చేస్తుంటే క్రమంగా కరిగిపోయే అవకాశం ఉంటుంది.

అలాగే ఈ ఉత్తరేణి విత్తనాలని పౌడర్ మాదిరిగా తయారు చేసుకోవాలి. ఆ పౌడర్ ని ఉప్పుతో కలిపి ఉంచుకోవాలి. ఉదయం లేవగానే ఈ పౌడర్ తో పళ్ళు తోముకోవడం ద్వారా పళ్లకు సంబంధించిన ఏ సమస్య అయినా తొందరగా తగ్గిపోతుంది. అలాగే పంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు ఏవి కూడా దరికి రావు. పళ్ళు కూడా తెల్లగా మారుతాయి. ఇక గాయాలను కూడా వెంటనే మానిపోయేలా చేయడంలో ఈ మొక్క ఎంతోబాగా ఉపయోగపడుతుంది.