మామూలుగా మనలో కొంతమంది బిర్యానీని ఇష్టపడితే మరి కొంతమంది పులావ్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ రెండింటిలో ఉపయోగించేది ఒకే రకాల మసాలాలు అయినప్పటికీ రుచి వేటికవే సపరేట్ అని చెప్పాలి. అయితే వీటిలో ఎక్కువ శాతం మంది బిర్యాని ఇష్టపడుతూ ఉంటారు. కానీ బిర్యానీ ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతున్నారు. దీనివల్ల అనేక సమస్యలు వస్తాయట. బీపీ పెరగడం నుంచి సుగర్స్ వరకు చాలా రకాల సమస్యలు వస్తాయని చెబుతున్నారు. బరువు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.
అయితే వెజిటేబుల్ పులావ్ బిర్యానీ కి ఈక్వల్ గా ఉన్నప్పటికీ టెస్ట్ లా కాస్త రుచి అటు ఇటుగా ఉంటుంది. కానీ మసాలాలు అలాగే ఇతర పదార్థాలు తక్కువగా ఉంటాయి. బిర్యానీ అంత ఘాటుగా పులావ్ ఉండదు. వెజిటేబుల్ పులావ్ లో మనకు ఇష్టమైన కూరగాయలన్నీ వేసి చేసుకోవచ్చు. మసాలాలు కాస్త తక్కువగా వేసుకుంటే కావాల్సిన పోషకాలు కూడా అందుతాయి. అలాగే ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. కానీ బిర్యానీలో అలా కాదు మసాలాలు ఎక్కువగానే ఉంటాయి. బిర్యానీ ఎక్కువగా తింటే మాత్రం సమస్యలు తప్పవు.
బిర్యానీ పులావ్ రెండింటి టేస్ట్ ఉంటుంది కదా పులావ్ ఎందుకు లైట్ గా అనిపిస్తుంది అనే అనుమానం రావచ్చు. చేసే విధానం, కలిపే మసలాలా పదార్థాలలో చాలా తేడా ఉంటుంది. పులావ్‌ని కాస్తా పొడవైన బియ్యంతో చేస్తే, బిర్యానీని పర్టిక్యులర్‌గా బాస్మతితోనే చేస్తారు. పులావ్‌ని మనం కూరగాయలు అవన్నీ వేసి ఉడికిస్తే బిర్యానీని మాత్రం అందులో వేసే పదార్థాలను మారినేట్ చేసి లేయర్ లేయర్‌గా కలిపి దమ్ చేసి ఉడికిస్తారు. పులావ్ కాస్తా మైల్డ్ టేస్ట్ ఉంటే బిర్యానీ మాత్రం ఘాటుగా ఉంటంది. బిర్యానీలో వేసే పదార్థాలు ఘాటు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బిర్యానీ పులావ్ లో బిర్యానికి కాస్త దూరంగా ఉండటం మంచిది అని చెబుతున్నారు.