ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక సమయంలో కాఫీలు టీలు తాగడం అన్నది కామన్. మామూలు వ్యక్తులు మాత్రమే కాకుండా ప్రెగ్నెన్సీ స్త్రీలు కూడా కొంతమంది పాలు తాగితే మరికొందరు కాఫీ ఇంకొందరు టీ తాగుతూ ఉంటారు. అయితే మరి ప్రెగ్నెన్సీ స్త్రీలు కాఫీ టీలు తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గర్భిణీ స్త్రీలు కాఫీ తాగడం ముఖ్యంగా ఎక్కువగా తాగడం అంత మంచిది కాదని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో టిఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అది మి శరీరంలో ఎక్కువకాలం ఉంటుందట.
దానివల్ల మావిలో చేరి బిడ్డ రక్త ప్రవాహంలోకి చేరుతుందట. రక్త ప్రవాహంలోకి చేరితే అది పిల్లల ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అని చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో కాఫీలో ఉండే కేఫిన్ మహిళల్లో రక్తపోటు హృదయస్పందన రేటును పెంచుతుందట. అంతేకాకుండా శరీరంలో మూత్రం పరిమాణం కూడా పెరుగుతుందట. నిద్ర సమస్యలను కూడా కలిగిస్తుందట. గర్భధారణ సమయంలో కెఫిన్ సున్నితంగా మారుతారు. ఎందుకంటే అవి రక్తం నుంచి శుభ్రపడటానికి ఎక్కువ సమయం పడుతుందట.
దీనివల్ల తలనొప్పి, నీరసం, వికారం వంటి సమస్యలు వస్తాయట. ఎక్కువ మొత్తంలో కెఫిన్ తీసుకోవడం వల్ల గర్భస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుందట. అంతేకాకుండా ఇది వంధ్యత్వంతో ముడిపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయంపై సరైన స్పష్టత లేకపోయినప్పటికీ కాఫీలకు టీలకు దూరంగా ఉండటమే మంచిది అని చెబుతున్నారు. ఒక మహిళ ప్రతిరోజు 200 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ టిఫిన్ తీసుకుంటే గర్భస్థరాగం ప్రమాదం పెరుగుతుందట. అందుకే వీలైనంతవరకు కెఫెన్ పరిమితం చేయాలని చెబుతున్నారు..