Site icon HashtagU Telugu

Monsoon Malaria: టీ పొడిని గిన్నెలో వేసి కాల్చితే ఇంట్లో ఉన్న దోమలన్నీ పారిపోతాయా?

Mosquito Bites

Mosquito Bites

దోమ..ఇవి చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ మనుషులను ప్రాణాలను సైతం తీయగల శక్తి వీటికి ఉంటాయి. ఈ దోమలు ప్రాణాంతకమైన వ్యాధులను తీసుకువచ్చి మనుషులను ఆస్పత్రులు చుట్టూ తిరిగేలా చేయగలవు. అంతేకాకుండా మనుషుల ప్రాణాలను సైతం తీయగలవు. అయితే చాలామంది దోమ కుట్టినా కూడా వాటిని సరదాగా తీసుకుంటూ ఉంటారు. అలాగే దోమ కుట్టినప్పుడు కాసేపు నొప్పి ఆ తర్వాత దురద మాత్రమే అనిపిస్తాయి. కానీ ఆ దోమ కుట్టిన సమయంలో అందులో నుంచి మన శరీరంలోకి అనేక రకాల బ్యాక్టీరియాను ప్రవేశింపజేస్తాయి.

ముఖ్యంగా కుటుంబ సభ్యులు దోమ కాటుకు గురై, వాటి వల్ల వ్యాపించే మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి భయంకరమైన వ్యాదుల భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా చెప్పాలి అంటే మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. అయితే ఇంతటి భయంకరమైన దోమలను మన ఇంటి నుంచి తరిమేయాలి అంటే కొన్ని రకాల చిట్కాలను పాటించాల్సిందే. అయితే మార్కెట్లో దోమలను తరిమి కొట్టడానికి అనేక రకాల మందులు వచ్చినప్పటికీ అవి దోమలను ఏం చేయలేకపోతున్నాయి.

మార్కెట్లో దొరికే నాణ్యత లేని దోమల నివారణ కాయిల్స్ తయారీలో ప్రమాదకరమైన రసాయనాలను వాడటం వల్ల దోమల బెడత తప్పడం విషయం పక్కనపెడితే దానివల్ల మనం అనారోగ్యం పారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు అవగాహన లేకపోవడం, అతి తక్కువ ధరలకు లభిస్తుండటంతో ఈ ప్రమాదకర ఈ మస్క్యుటో కాయిల్స్ ని ఎక్కువగా వాడుతుంటారు. అమ్మకందారులతో పాటు కొనేవారికి కూడా వీటిని ఎంత ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్నారు, వాటి వల్ల ప్రజల ఆరోగ్యం ఎంతలా ప్రభావితమవుతుంది అన్నది చాలామందికి తెలియదు. అయితే ఈ దోమలను ఇంటి నుంచి తరిమి కొట్టడానికి అనేక రకాల చిట్కాలు కూడా ఉన్నాయి.

వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా మనం ఇంట్లో ఉపయోగించే టీ పొడిని ఒక పాత్రలో వేసి కాల్చితే ఆ ఘాటు వాసనకు దోమలు ఆ దరిదాపుల్లోకి కూడా రావు. అదేవిధంగా పుదీనా మొక్కను ఒక కుండీలో పెట్టుకొని దాన్ని నీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఆ ఘాటైన వాసనకు దోమలు రావు. అలాగే ఒక గ్లాసులో సగం వరకు నీటిని తీసుకొని ఆ నీటిలో కర్పూరం బిళ్ళలను వేయడం వల్ల ఆ ఘాటు వాసనకు దోమలు రావు. అలాగే నిమ్మకాయను సగానికి కోసి అందులో లవంగాలు పెట్టడం వల్ల ఆ ఘాటైన వాసనకు కూడా దోమలు రావు. అలాగే తులసి రసాన్ని ఒంటికి పూసుకోవడం వల్ల కూడా దోమలు దరి చేరవు.