Site icon HashtagU Telugu

Health Tips: ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

Health Tips

Health Tips

ప్రస్తుత రోజుల్లో కంప్యూటర్లు మొబైల్ ఫోన్లు ల్యాప్‌టాప్‌ ల వాడకం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ల్యాప్‌టాప్‌ ని వినియోగిస్తూ ఉంటారు. ఇది కొందరు వర్క్ కోసం ల్యాప్‌టాప్‌ ని ఉపయోగిస్తే ఇంకొందరు చూడడానికి గేమ్స్ ఆడటానికి ఇలా అనేక రకాల వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసే వారు ముఖ్యంగా పురుషులు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే తమ ఒడిలో ల్యాప్‌టాప్‌తో గంటల తరబడి పని చేయడం.

ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అంతేకాకుండా ఇది పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
చాలా మంది పురుషులు తమ ఒడిలో ఎక్కువగా ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తారు. ఇది క్రమంగా పురుషుల లైంగిక జీవితం, సంతానంపై ప్రభావం చూపుతుంది. మరి ఒడిలో ల్యాప్‌టాప్‌ ని పెట్టుకుని వర్క్ చేయడం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నిరంతరం వేడికి గురికావడం వల్ల వృషణాలలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యత కూడా చాలా వరకు తగ్గుతుంది. పురుష పునరుత్పత్తి వ్యవస్థ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోవడమే దీనికి కారణం.

స్పెర్మ్ ఉత్పత్తి, పనితీరుకు చల్లని వాతావరణం అవసరం. ల్యాప్‌టాప్‌ని ఒడిలో ఉంచినప్పుడు, దాని నుండి వచ్చే వేడి వృషణాల ఉష్ణోగ్రతను పెంచి లైంగిక శక్తిని దెబ్బతీస్తుంది. ఇది స్క్రోటల్ హైపర్‌థెర్మియా అనే సమస్యకు దారి తీస్తుంది. ఇంకా ఫలదీకరణానికి ఆటంకం కలిగిస్తుంది.
ల్యాప్‌టాప్‌ని ఒడిలో ఉంచి పనిచేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్‌లు తరచుగా విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి. ఇది స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇకమీదటైనా పురుషులు ఈ విధంగా చేయకపోవడం మంచిది.